Viral: ఛీ ఛీ.. వీళ్లు సైనికులేనా.. ఆహారం కోసం లైంగిక వాఛ తీర్చాలంటూ..
ABN , Publish Date - Jul 22 , 2024 | 04:27 PM
ఆకలితో అలమటిస్తున్న వారిని చూస్తే ఎవ్వరికైనా జాలేస్తుంది. ఎంతోకొంత సహాయం చేసి, వారి కడుపు నింపాలని అనిపిస్తుంది. మన దగ్గర డబ్బులు లేకపోయినా.. ఏదో ఒక హెల్ప్ చేయాలనిపిస్తుంది.
ఆకలితో అలమటిస్తున్న వారిని చూస్తే ఎవ్వరికైనా జాలేస్తుంది. ఎంతోకొంత సహాయం చేసి, వారి కడుపు నింపాలని అనిపిస్తుంది. కానీ.. ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో (Sudan) మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా, చాలా దారుణంగా ఉన్నాయి. రక్షణగా ఉండాల్సిన సైనికులే మహిళలపై దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఆహారాన్ని అడ్డం పెట్టుకొని.. వారిపై లైంగిక దాడులు చేస్తున్నారు. ‘‘ఆకలేస్తోంది, కడుపు మాడిపోతోంది, పట్టెడన్నం పెట్టండయ్యా’’ అని చేతులు జోడించి అడుగుతుంటే.. కామవాంఛ తీరిస్తేనే ఆహారం ఇస్తామంటూ మహిళల పట్ల రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. ఒమ్దుర్‌మన్ పట్టణంలోని కొందరు మహిళలు ఎదుర్కొంటున్న ఈ దుస్థితి గురించి ‘ది గార్డియన్’ ఓ కథనం ప్రచురించింది.
అంతర్యుద్ధం..
గత కొంతకాలం నుంచి ఒమ్దుర్‌మన్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య ఘర్షణ.. ఈ సివిల్ వార్‌కు దారి తీసింది. దీని వల్ల చాలామంది అక్కడి నుంచి పారిపోయారు. కానీ.. కొన్ని కుటుంబాలు అక్కడే చిక్కుకుపోయాయి. వారిలో 24 మంది మహిళలు ఉన్నారు. అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల ఆ కుటుంబాలకు ఆహార కొరత ఏర్పడింది. కేవలం సైన్యం వద్ద మాత్రమే ఆహారం లభిస్తోంది. అక్కడున్న ఫ్యాక్టరీల్లోనే ఆహార నిల్వలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో.. ఆహారం కోసం సైనికుల ముందు చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఆ కుటుంబాలకు నెలకొంది. ఇదే అదునుగా.. సైనికులు మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఆహారం, ఇతర వస్తువులు ఇచ్చి.. తమ కోర్కెలు తీర్చుకుంటున్నారు.
Read Also: ఆటో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. కారణం తెలిస్తే
పాపం.. తమ కుటుంబాలను కాపాడుకోవడం కోసం మహిళలకు మరో దారి లేక, ఆ సైనికులకు తలొగ్గాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా బాధిత మహిళలే మీడియాకు తెలిపారు. తాము ఎదుర్కొంటున్న పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదని రోదిస్తున్నారు. తన బిడ్డల ఆకలి తీర్చడం కోసం.. వాళ్లు చెప్పినట్లు చేయాల్సి వస్తోందని ఓ మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ వాళ్లు చెప్పినట్లు చేయకపోతే.. వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. వారి కామవాంఛ తీర్చడానికి ఒప్పుకోకపోవడంతో.. 21 ఏళ్ల యువతి కాళ్లకు నిప్పు పెట్టారని స్థానికులు చెప్పారు. తమకు నచ్చిన వాళ్లను తీసుకెళ్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని బట్టి.. వాళ్లు ఎంతటి భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రారంభం నుంచే..
కాగా.. ఆ దేశంలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే మహిళలపై ఈ అఘాయిత్యాలు ప్రారంభమైనట్లు ది గార్డియన్ వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ 15వ తేదీన సివిల్ వార్ మొదలైన కొద్దిరోజుల్లోనే.. సైనికులు మహిళలపై అత్యాచారం చేశారు. మరోవైపు.. ఈ యుద్ధంలో వేలల్లో మరణాలు సంభవించాయి. ఓ నివేదిక ప్రకారం.. మరణాల సంఖ్య 150,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. 11 మిలియన్ల మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారంటే.. ఈ యుద్ధం ఎంత ప్రభావం చూపించిందో మీరే అర్థం చేసుకోండి.
Read Latest International News and Telugu News