Share News

AI Software Engineer: మరో సంచలనం.. ప్రపంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎంట్రీ.. ఇదేం చేస్తుందో తెలుసా?

ABN , Publish Date - Mar 13 , 2024 | 05:16 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వచ్చిన తర్వాత సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. క్లిష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా కొత్త యాప్స్ (Apps), టూల్స్ (Tools) పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలైతే హ్యూమనాయిడ్ రోబోట్‌లను (Humanoid Robots) కూడా సిద్ధం చేశాయి. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన కాగ్నిషన్ (Cognition) అనే స్టార్టప్ సరికొత్త సంచలనానికి పునాది వేసింది.

AI Software Engineer: మరో సంచలనం.. ప్రపంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎంట్రీ.. ఇదేం చేస్తుందో తెలుసా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వచ్చిన తర్వాత సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. క్లిష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా కొత్త యాప్స్ (Apps), టూల్స్ (Tools) పుట్టుకొస్తున్నాయి. కొన్ని సంస్థలైతే హ్యూమనాయిడ్ రోబోట్‌లను (Humanoid Robots) కూడా సిద్ధం చేశాయి. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన కాగ్నిషన్ (Cognition) అనే స్టార్టప్ సరికొత్త సంచలనానికి పునాది వేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని (AI Software Engineer) తయారు చేసింది. దీనికి డెవిన్ (Devin) అనే పేరు పెట్టారు. ఇది వెబ్‌సైట్స్, వీడియోలను రూపొందించేందుకు కోడ్స్‌ని రాయగలదు, డీబగ్ చేయగలదు.


ఒక్క సింగిల్ కమాండ్ ఆధారంగా ఇది కోడ్స్ రాయడం, వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం వంటి నైపుణ్యాలను ఈ ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కలిగి ఉంటుంది. మీరు ఏం అడిగినా సరే, క్షణాల్లో చేసి పెట్టే సామర్థ్యం దీని సొంతం. ఇది బగ్స్‌ని వెంటనే గుర్తించి, వాటిని త్వరగా సరిదిద్దగలుగుతుంది. కోడింగ్ సూచనల్ని అందించడమే కాదు, కొన్ని టాస్కులను స్వయంగా పూర్తి చేస్తుంది. ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌ను తానే స్వయంగా కంప్లీట్ చేయగలుగుతుంది. దీనికి సొంత కమాండ్ లైన్, కోడ్ ఎడిటర్, బ్రౌజర్‌ అమర్చబడి ఉంటాయి. వీటి సహాయంతో డెవిన్ స్వతంత్రంగా పని చేస్తుంది. అయితే.. మాన‌వ ఇంజ‌నీర్ల‌ను రీప్లేస్ చేసే ఉద్దేశంతో దీనిని తయారు చేయలేదని, మనుషులతో కలిసి పని చేసే విధంగా ఈ డెవిన్‌ని డిజైన్ చేశామని కాగ్నిషన్ క్లారిటీ ఇచ్చింది.

ఈ డెవిన్.. ప్ర‌ముఖ ఏఐ కంపెనీల ప్రాక్టిక‌ల్ ఇంజ‌నీరింగ్‌ ఇంట‌ర్వ్యూల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసింద‌ని కంపెనీ తెలిపింది. ముంద‌స్తుగా ఆలోచించ‌డం, సంక్లిష్ట టాస్క్‌ల‌ను ప్లాన్ చేయడం వంటి అద్భుత సామర్థ్యాలని ఇది కలిగి ఉందని చెప్పింది. ఇది వేలాది నిర్ణయాలు తీసుకుంటుందని, అలాగే తన తప్పుల నుంచి నేర్చుకుంటుందని వెల్లడించింది. అయితే.. ఒక ఏఐని ప్రోగ్రామర్‌గా బోధించడం అనేది లోతైన అల్గారిథమిక్ ప్రాబ్లమ్ అని, ఇది భవిష్యత్తులో ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటుందనే దానిపై దశల వారీగా పరిశీలించాల్సి ఉంటుందని కాగ్నిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వు (Scott Wu) ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2024 | 05:16 PM