-
-
Home » Mukhyaamshalu » Today Telugu Breaking News Thursday 13th December 2024 Live Updates Shiva
-
Breaking News: అల్లు అర్జున్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ లైవ్ అప్‌డేట్స్
ABN , First Publish Date - Dec 13 , 2024 | 11:00 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2024-12-13T12:59:01+05:30
అల్లు అర్జున్‌పై నమోదు చేసిన కేసులివే..
హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ అరెస్ట్.
సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు.
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అరెస్ట్.
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు.
అల్లు అర్జున్‌పై 105, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు.
చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్ తరలింపు.
-
2024-12-13T12:47:56+05:30
హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
-
2024-12-13T12:17:20+05:30
బీజేపీ సంచలన ప్రకటన..
ఢిల్లీ: రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ.
16, 17 తేదీల్లో ఎంపీలంతా రాజ్యసభకు హాజరుకావాలని విప్ జారీ.
-
2024-12-13T12:14:39+05:30
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు..
అమరావతి: విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన ప్రజలు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్.
అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్.
ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్.
పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత, రైతు - వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్), శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశలలో సమగ్ర సాంకేతికత వంటి 10 సూత్రాలతో విజన్ 2047.
ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం.
స్వచ్ఛాంధ్ర స్టాల్ వద్ద సీఎం ఛలోక్తులు.
స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలని సూచన.
పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారంటూ విద్యార్థులతో సీఎం ముచ్చట.
మహిళా రైతులతో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ముఖాముఖి.
మహిళా ఆర్థికాభివృద్ధికి అందుతున్న తోడ్పాటుపై వివరాలు అడిగి తెలుసుకున్న నేతలు.
స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ను 10సూత్రాలతో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు పంచుకున్న వివిధ వర్గాల ప్రజలు.
ఆక్వా ఉత్పత్తుల రవాణాలో ఇబ్బందులు పరిష్కరించాలని కోరిన ఆక్వా రైతులు.
మహిళా ఆర్థికాభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామన్న డ్వాక్రా మహిళ సుహాసిని.
2047నాటికి ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని.
విజన్ స్వర్థాంధ్ర 2047పై ప్రత్యేక వీడియో విడుదల.
-
2024-12-13T12:00:12+05:30
పోలీసుల అదుపులో ఎంపీ అవినాష్ రెడ్డి..
కడప : పులివెందులనియోజకవర్గం వేములలో ఉద్రిక్తత.
పోలీస్ స్టేషన్ వద్ద ఎంపీ అవి నాష్ రెడ్డితో పాటు భారీగా తరలి వచ్చిన వైసీపీ కార్యకర్తలు.
తాహసిల్దార్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన టిడిపి శ్రేణులు.
సాగునీటి సంఘాల ఎన్నికలపై మాట్లాడేందుకు తాహసిల్దారు కార్యాలయానికి వెళ్లేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నాలు.
అవినాష్ రెడ్డి వెళ్తే గొడవలు జరుగుతాయని ఉద్దేశంతో అడ్డుకున్న పోలీసులు.
అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పులివెందులకు తరలించిన పోలీసులు.
-
2024-12-13T11:17:18+05:30
అమరావతి: అస్తవ్యస్తంగా మారిన విజయవాడ ట్రాఫిక్
విజయవాడలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
బందర్ రోడ్డు లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ @2047 ఆవిష్కరణ
ఈ కార్యక్రమానికి వస్తున్న సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం, ఇతర కేబినెట్ మంత్రులు
ఈ సమావేశానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి 670 బస్సుల్లో ప్రజానీకం తరలింపు
డ్వాక్రా , మెప్మా, మహిళలు, MSME లకు చెందిన వారిని బస్ ల్లో తరలింపు
సుమారు 2000 కార్లు వస్తాయని అంచనా వేసిన పోలీసులు
24 పార్కింగ్ ప్రదేశాలకు వాహనాలు తరలింపు
విజయవాడ లోకి భారీ వాహనాల రాకపోకలు ను నిలిపివేసిన పోలీసులు
బందర్ రోడ్డు లోకి సదస్సుకు వెళ్ళే వాహనాలకు మాత్రమే అనుమతి
కనకదుర్గమ్మ వారధి నుంచి విజయవాడ కు వచ్చే ప్రదేశంలో బందర్ రోడ్డు లోకి వెళ్ళే ప్రాంతంలో నిలిచిన ట్రాఫిక్
పార్కింగ్ ప్రదేశాల నుంచి బందర్ రోడ్డు లోని ఇందిరాగాంధీ స్టేడియం కు నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు
-
2024-12-13T11:00:22+05:30
కృష్ణా: అజ్ఞాతంలోకి పేర్ని నాని కుటుంబం..
మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.
బెయిల్ పిటిషన్ వేసిన పేర్ని నాని భార్య జయసుధ.
సివిల్ సప్లయి గోదాంలో బియ్యం అవకతవకలపై కేసు నమోదు.
ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని భార్య జయసుధ.
పేర్ని నాని వ్యక్తి గత సహాయకుడు మానస తేజ పేర్ని నానిపై కూడా కేసు నమోదు.
గత మూడు రోజులుగా అందుబాటులో లేని పేర్ని నాని.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం.