Share News

Woman Chained In Forest: ఇనుప గొలుసులతో మహిళను అడవిలో చెట్టుకు కట్టేసిన వైనం!

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:15 PM

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత అమానవీయమైన ఘటన నమోదయింది. ఓ 50 ఏళ్ల మహిళను ఇనుప గొలుసులతో ఎవరో వ్యక్తులు ఓ చెట్టుకు కట్టేశారు. ఆమెను ఎవరు బంధించారో తెలియదు. కానీ అడవిలో ఓ పశువులకాపరి ఆమె ఏడుపులు విని దగ్గరకు వెళ్లి చూసి షాక్‌కు గురయ్యాడు.

Woman Chained In Forest: ఇనుప గొలుసులతో మహిళను అడవిలో చెట్టుకు కట్టేసిన వైనం!
Woman Chained In Forest

ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత అమానవీయమైన ఘటన నమోదయింది. ఓ 50 ఏళ్ల మహిళను ఇనుప గొలుసులతో ఎవరో వ్యక్తులు ఓ చెట్టుకు కట్టేశారు. ఆమెను ఎవరు బంధించారో తెలియదు. కానీ అడవిలో ఓ పశువులకాపరి ఆమె ఏడుపులు విని దగ్గరకు వెళ్లి చూసి షాక్‌కు గురయ్యాడు. ముంబై నగరానికి 450 కిలోమీటర్ల దూరంలో ఉండే సోనుర్లి గ్రామంలో శనివారం సాయంత్రం అతడు ఆమెను గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె వద్ద అమెరికా పాస్‌పోర్ట్ ఫోటోకాపీతో పాటు తమిళనాడు చిరునామాతో ఒక ఆధార్ కార్డు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ రెండు గుర్తింపు పత్రాలను ఆధారంగా ఆమె ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.


తీవ్ర అనారోగ్యంతో ఉన్న సదరు మహిళను కోంకణ్ ప్రాంతంలోని సావంత్‌వాడి ఆసుపత్రికి తీసుకెళ్లామని, మెరుగైన చికిత్స కోసం సింధుదుర్గ్‌లోని ఓరోస్‌లో ఉన్న మరో ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. ఇక ఆమె మానసిక, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మరింత మెరుగైన చికిత్స కోసం అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న గోవా మెడికల్ కాలేజీకి తరలించారమని వివరించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని, వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని, ఆమె వద్ద లభించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ల ఆధారంగా ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు అర్థమవుతోందని వివరించారు.


కాగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాధిత మహిళ వద్ద తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డ్, అమెరికా పాస్‌పోర్ట్ ఫొటోకాపీని గుర్తించామని చెప్పారు. లభ్యమైన ధ్రువీకరణ పత్రాల ప్రకారం ఆమె పేరు ‘లలితా కయీ’ అని గుర్తించామని, ఆమె వీసా గడువు ముగిసిందని తెలిపారు. ఆమె జాతీయతను నిర్ధారించేందుకు ఈ పత్రాలన్నింటినీ ధ్రువీకరించుకునే పనిలో ఉన్నామని, ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌తో మాట్లాడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.


ప్రాథమిక సమాచారం ప్రకారం సదరు మహిళ గత 10 ఏళ్లుగా ఇండియాలోనే ఉంటుందని, ఆమె ప్రస్తుతం స్టేట్‌మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పారు. కొన్ని రోజులుగా ఆమె తినకపోవడంతో బక్కచిక్కి పోయిందని, బలహీనంగా మారిపోయిందని వివరించారు. ఆమె ఇనుప గొలుసులతో కట్టేసిన ప్రాంతంలో బాగా వర్షాలు కురుస్తుంటాయి. మరోవైపు ఆమెను బంధించి ఎంతకాలం అయ్యిందో కూడా తెలియదు. అయితే తమిళనాడుకు చెందిన ఆమె భర్తే కట్టేసి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆమె బంధువులు, తెలిసినవారిని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు తమిళనాడు, గోవాలోని పలు ప్రాంతాలకు బయలుదేరాయని ఒక అధికారి వివరించారు.

ఇవి కూడా చదవండి

సుప్రీంకు ఢిల్లీ రాజేంద్రనగర్ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు

బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను వెన్నుపోటు పొడిచింది.. రాహుల్ గాంధీ ధ్వజం

For more National News and Telugu News

Updated Date - Jul 29 , 2024 | 06:49 PM