Republic Day: గుర్రపు బగ్గీలో ప్రయాణించిన రాష్ట్రపతి.. దాని వెనక ఆసక్తికర స్టోరీ..
ABN , Publish Date - Jan 26 , 2024 | 02:34 PM
దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ఎగరేశారు. వేదిక దగ్గరికి చేరుకునే ముందే ఆమె.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి బయటకి వచ్చారు. అయితే ప్రతిసారిలాగా రాష్ట్రపతి బుల్లెట్ ప్రూఫ్ కార్‌లో కాకుండా.. అతిథితోపాటు ఒక గుర్రపు బగ్గీ(Horse Buggy)లో ఎక్కి వేదికవద్దకు చేరుకున్నారు.
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ఎగరేశారు. వేదిక దగ్గరికి చేరుకునే ముందే ఆమె.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి బయటకి వచ్చారు. అయితే ప్రతిసారిలాగా రాష్ట్రపతి బుల్లెట్ ప్రూఫ్ కార్‌లో కాకుండా.. అతిథితోపాటు ఒక గుర్రపు బగ్గీ(Horse Buggy)లో ఎక్కి వేదికవద్దకు చేరుకున్నారు. ఆమె ప్రయాణించిన బగ్గీ గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి పెద్ద చరిత్రే ఉందండోయ్. ఉత్సవ యాత్ర కోసం ఇద్దరు విదేశీ అధ్యక్షులు కలోనియల్ కాలం నాటి ఓపెన్ ఎయిర్ బగ్గీపై ప్రయాణించారు. సరిగ్గా 40 ఏళ్ల కిందట ఇది జరగ్గా.. ఇన్నేళ్లకు రాష్ట్రపతి ముర్ము మళ్లీ బగ్గీలో ప్రయాణించారు.
బగ్గీ స్పెషాలిటీలివే..
బగ్గీకి ఆరు గుర్రాలు ఉంటాయి. బంగారు పూత పూసిన అంచులు, ఎరుపు వెల్వెట్ ఇంటీరియర్, అశోక చక్రాన్ని కలిగి ఉంటుంది. ఈ బగ్గీ బ్రిటిష్ కాలంలోని ఓ భారత వైస్రాయ్‌కు చెందినది. అయితే, వలస పాలన ముగిసినప్పుడు, భారత్‌తోపాటు కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్.. బగ్గీ కోసం పోటీ పడ్డాయి. దాన్ని ఏ దేశం తీసుకోవాలనే అంశంపై సందిగ్ధత ఏర్పడగా ఓ పరిష్కార మార్గాన్ని కనుక్కొన్నాయి.
లక్కీ కాయిన్ టాస్..
బగ్గీ ఎవరి దగ్గర ఉండాలనేదానిపై కాయిన్ టాస్ వేద్దామనుకున్నారు. భారత్‌కు చెందిన కల్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్, పాకిస్థాన్‌కు చెందిన సహబ్జాదా యాకూబ్ ఖాన్ నాణేన్ని తిప్పారు. ఈ పోటీలో భారత్ నెగ్గింది. అప్పటి నుంచి బగ్గీ భారత్‌లోనే ఉంటోంది. జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకకు దేశాధినేతను తీసుకెళ్లేందుకు కూడా ఈ క్యారేజీని ఉపయోగిస్తారు. అయితే రాష్ట్రపతి భద్రతా కారణాల రీత్యా 40 ఏళ్ల క్రితం బుల్లెట్ ప్రూఫ్ కార్లను కేటాయించారు. ఇన్నాళ్ల తరువాత బగ్గీని మళ్లీ బయటకు తీశారు.