Share News

Assam floods: మళ్లీ భారీ వర్షాలు, వరదలు.. 25కి చేరిన మృతులు

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:23 PM

రెమాల్ తుపాన్ కారణంగా భారీ వర్షాలు, వరదలతో ఈశాన్యంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆ క్రమంలో అసోంలో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు మరణించిన వారి సంఖ్య 25కు చేరింది.

Assam floods: మళ్లీ భారీ వర్షాలు, వరదలు.. 25కి చేరిన మృతులు

అసోం, జూన్ 05: రెమాల్ తుపాన్ కారణంగా భారీ వర్షాలు, వరదలతో ఈశాన్యంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆ క్రమంలో అసోంలో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. కాక్రా జిల్లాలో అయిదుగురు నీటి మునిగి మరణించారు. అలాగే నాగవ్ జిల్లాలో మహిళ మృతి చెందింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం వెల్లడించింది. ఈ వరదల వల్ల 10 జిల్లాల్లోని మొత్తం 4.23 లక్షల మంది ప్రజలు రాశ్రయులయ్యారని తెలిపింది.


అలాగే 453 గ్రామాలు ప్రస్తుతం నీటి మునిగి ఉన్నాయని వివరించింది. ఇక ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బ్రహ్మపుత్ర, కొపిలి, కుషియారా నదులు పొంగి ప్రవహిస్తున్నాయని పేర్కొంది. దీంతో ఆ యా నదీ పరివాహక ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు ఈ వర్షాలు, వరదలతో తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందని వెల్లడించింది. అయితే సహాయక పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని వివరించింది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 05 , 2024 | 05:23 PM