Viral: ఎంత నొక్కేశాడో గానీ, రూ.500 నోట్లతో నిండిన మంచంపై పడక.. వైరల్ అవుతున్న అసోం రాజకీయ నాయకుడి లీలలు!
ABN , Publish Date - Mar 27 , 2024 | 05:09 PM
అసోంలోని ఓ రాజకీయ నాయకుడి వైభవం చూసి ధనవంతులు సైతం అవాక్కవుతున్నారు. తడు రూ.500 నోట్లు ఉన్న మంచంపై నిద్రిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసోంలోని ఓ రాజకీయ నాయకుడి (Assam politician) వైభవం చూసి ధనవంతులు సైతం అవాక్కవుతున్నారు. ఉదల్‌గిరి జిల్లాలోని భైరగురిలో విలేజ్ కౌన్సిల్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ బెంజమిన్ బసుమతరీ (Benjamin Basumatary) అనే వ్యక్తి అవినీతి (Corruption) చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం, గ్రామీణ ఉద్యోగాల స్కీమ్‌లో బెంజమిన్ భారీ అవినీతికి పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. అతడు రూ.500 నోట్లు ఉన్న మంచంపై (Rs.500 notes bed) నిద్రిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి.
ఒడల్‌గూరి డెవలప్‌మెంట్ జోన్‌లోని తన వీసీడీసీ పరిధిలోని పీఎంఏవై, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పథకాల లబ్ధిదారుల నుంచి బెంజమిన్ లంచాలు తీసుకున్నాడని ఆరోపణలు చెలరేగాయి. అసోం యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL) సభ్యుడైన బెంజమిన్‌పై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. బెంజమిన్ అవినీతి తమ పార్టీకి అంటుకోవడంతో యూపీపీఎల్ తక్షణమే స్పందించి వివరణ ఇచ్చింది. ఇకపై బెంజమిన్‌తో తమ పార్టీకి సంబంధం ఉండదని క్లారిటీ ఇచ్చింది.
బెంజమిన్‌ను యూపీపీఎల్‌తో లింక్ చేయడం మానుకోవాలని అన్ని మీడియా సంస్థలను, సోషల్ మీడియా వినియోగదారులను ఆ పార్టీ నేత ప్రమోదో బోరో కోరారు. బెంజమిన్ వ్యక్తిగత చర్యలకు పూర్తి బాధ్యత అతడిదేనని, పార్టీ జవాబుదారీ కాదని ఆయన పేర్కొన్నారు.