Share News

Summer Season: కారు కడగడంపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఏ రాష్ట్రంలో అంటే..

ABN , Publish Date - May 05 , 2024 | 04:16 PM

భవిష్యత్తులో యుద్దాలు.. రాజ్యాలు కోసం... సంపదలు కోసం జరగవు.. నీటి కోసం జరుగుతాయంటూ భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు దశాబ్దాల క్రితమే స్పష్టం చేశారు. చూడబోతే ఆయన వ్యాఖ్యలు అక్షర సత్యాలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Summer Season: కారు కడగడంపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఏ రాష్ట్రంలో అంటే..
Car Wash

డెహ్రాడున్, మే 05: భవిష్యత్తులో యుద్దాలు.. రాజ్యాలు కోసం... సంపదలు కోసం.. జరగవు.. నీటి కోసం జరుగుతాయంటూ భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు దశాబ్దాల క్రితమే స్పష్టం చేశారు. చూడబోతే ఆయన వ్యాఖ్యలు భవిష్యత్తులో అక్షర సత్యాలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే బెంగళూరులో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Lok Sabha Elections: నేటితో ప్రచారానికి తెర.. ఎల్లుండే మూడో దశ పోలింగ్

ఈ ఒక్క నగరంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలో ఉత్తరఖండ్‌ రాష్ట్రం సైతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. అదీకాక గత వేసవి కాలంలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. అలాగే వర్షాలు సైతం లేకుండా పోయాయి. మరోవైపు ఈ శీతాకాలంలో చాలా తక్కువ వర్షపాతం, హిమపాతం నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన


ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కారులను నీటితో కడగడంపై నిషేధం విధించింది. శనివారం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి నేతృత్వంలో జిల్లా ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం దామి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో వర్క్ షాప్‌ల్లో కారులను డ్రై వాష్‌ చేయాలని సూచించారు.

Hardeep Nijjar Murder: భారతీయులు అరెస్ట్.. స్పందించిన జై శంకర్

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ నగరాల్లోని ప్రజలు నీటి కోసం తీవ్ర ఆగచాట్లు పడుతున్నారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. మరోవైపు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు నీటికి అందించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకుడు ఎన్. కె. గుసైన్ డిమాండ్ చేశారు.

For Latest News and National News click here

Updated Date - May 05 , 2024 | 05:21 PM