Share News

చంద్రయాన్‌-4, 5 డిజైన్లు పూర్తి: ఇస్రో చైర్మన్‌

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:11 AM

చంద్రయాన్‌-3 విజయవంతం నేపథ్యంలో తదుపరి మిషన్ల కోసం చంద్రయాన్‌-4, 5 డిజైన్లు కూడా పూర్తయ్యాయని, వాటికి ప్రభుత్వ అనుమతి కోరే పనిలో ఉన్నామని ఇస్రో

చంద్రయాన్‌-4, 5 డిజైన్లు పూర్తి: ఇస్రో చైర్మన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 20: చంద్రయాన్‌-3 విజయవంతం నేపథ్యంలో తదుపరి మిషన్ల కోసం చంద్రయాన్‌-4, 5 డిజైన్లు కూడా పూర్తయ్యాయని, వాటికి ప్రభుత్వ అనుమతి కోరే పనిలో ఉన్నామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ మంగళవారం వెల్లడించారు. చంద్రయాన్‌-4 మిషన్‌ 2028లో ఉంటుందని ఇస్రో గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, వచ్చే ఐదేళ్లలో 70 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుందని సోమనాథ్‌ పేర్కొన్నారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తొలి మానవ రహిత మిషన్‌ను ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభిస్తామని, ఇప్పటికే రాకెట్‌కు సంబంధించిన అన్ని దశలూ శ్రీహరికోటలోని షార్‌కు చేరుకున్నాయని సోమనాథ్‌ వెల్లడించారు. ఇదిలా ఉండగా, చిన్న చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరవేసేందుకు వినియోగిస్తున్న స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ (ఎస్‌ఎ్‌సఎల్వీ) రాకెట్ల తయారీపై పదికిపైగా ప్రైవేటు కంపెనీలు ఆసక్తి కనబరిచాయని సోమనాథ్‌ మంగళవారం తెలిపారు.

Updated Date - Aug 21 , 2024 | 05:11 AM