Share News

CJI Worshiped Dwaraka: ద్వారకాధీశునికి పూజలు చేసిన సీజేఐ

ABN , Publish Date - Jan 06 , 2024 | 02:50 PM

శ్రీకృష్ణ భగవానుడు కొలువైన ద్వారకను భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శనివారంనాడు దర్శించుకున్నారు. ద్వారకాధీశుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పసుపు రంగు దుస్తులు ధరించి సతీ సమేతంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. సీజేఐ రాక సందర్భంగా ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

CJI Worshiped Dwaraka: ద్వారకాధీశునికి పూజలు చేసిన సీజేఐ

ద్వారక: శ్రీకృష్ణ భగవానుడు కొలువైన ద్వారక (Dwarka)ను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శనివారంనాడు దర్శించుకున్నారు. ద్వారకాధీశుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పసుపు రంగు దుస్తులు ధరించి సతీ సమేతంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. సీజేఐ రాక సందర్భంగా ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా కలెక్టర్ అశోక్ శర్మ, ఎస్పీ నితీష్ పాండే తదితరులు ఆలయం వద్ద జీజేఐకి స్వాగతం పలికారు. ఉదయమే ఆలయానికి చేరుకున్న సీజేఐ ఆలయ గోపురంపైన జెండాను ఆవిష్కరించారు. శ్రీకృష్ణ భగవానుని చరణ పాదుకలకు పూజలు చేశారు.


షెడ్యూల్ ప్రకారం సోమ్‌నాథ్ అలయంలో పూజలు చేసేందుకు రాజ్‌కోట్ నుంచి సీజేఐ బయలుదేరినప్పటికీ కారణాంతరాల వల్ల హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కాలేదు. దాంతో ఆయన షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ద్వారకాధీశుని దర్శించుకున్నారు. జామ్‌నగర్, దేవ్‌భూమి ద్వారక జిల్లాల అధికారులు, పలువురు జిల్లా జడ్జిలు ఆయన వెంట ఉన్నారు. తన పర్యటనలో భాగంగా రాజ్‌కోట్‌లో రూ.110 కోట్లతో కొత్తగా నిర్మించిన కోర్టు భవానాన్ని సీజేఐ ప్రారంభించారు. రాజ్‌కోట్ డీఎం ప్రభవ్ జోషి, కమిషనర్ రాజు భార్గవ, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

Updated Date - Jan 06 , 2024 | 02:50 PM