దేశ శ్రేయోవృద్ధికి స్వచ్ఛ భారత్
ABN , Publish Date - Oct 03 , 2024 | 05:37 AM
స్వచ్ఛ భారత్ మిషన్‌తో దేశ శ్రేయోవృద్ధికి సరికొత్త మార్గం ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమం స్వచ్ఛ భారత్ మిషనేనని పేర్కొన్నారు. దీని ప్రభావం ప్రజారోగ్యంపైనా, వారి జీవన విధానాలపైనా సానుకూల ప్రభావం చూపిస్తోందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించి పదేళ్లు
వెయ్యేళ్ల తర్వాతా గుర్తుండి పోతుంది: మోదీ
న్యూఢిల్లీ, అక్టోబరు 2: స్వచ్ఛ భారత్ మిషన్‌తో దేశ శ్రేయోవృద్ధికి సరికొత్త మార్గం ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమం స్వచ్ఛ భారత్ మిషనేనని పేర్కొన్నారు. దీని ప్రభావం ప్రజారోగ్యంపైనా, వారి జీవన విధానాలపైనా సానుకూల ప్రభావం చూపిస్తోందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ భారత్ కింద చేపట్టిన రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అదేవిధంగా పలు రాష్ట్రాల్లో ‘అమృత్ 2.0’ మిషన్ కింద ఏర్పాటు చేసిన మురికినీటి శుద్ధి ప్లాంట్లను ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ మిషన్ వెయ్యేళ్ల తర్వాత కూడా గుర్తుండిపోతుందన్నారు. పరిశుభ్రత అనేది వారసత్వంగా మారాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహాత్మా గాంధీని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని విపక్ష కాంగ్రె్‌సపై మోదీ ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. దేశంలో స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించిన తర్వాత ప్రతి ఇంటికీ మరుగు దొడ్డి ఉండాలన్న సంకల్పంతో పనిచేశామని, పదేళ్లలో 12కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని మోదీ తెలిపారు. ఈ పరిణామం మహిళల ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా చేసిందన్నారు. యూనిసెఫ్ నివేదిక కూడా దీన్ని స్పష్టం చేసిందన్నారు. 2014-19 మధ్య డయేరియా మరణాలు తగ్గుముఖం పట్టి 3లక్షల మంది జీవితాలను స్వచ్ఛ భారత్ నిలబెట్టిందని డబ్ల్యూహెచ్‌వో కూడా పేర్కొన్నట్టు తెలిపారు.
స్వచ్ఛ భారత్‌పై ప్రశంసల వెల్లువ
స్వచ్ఛ భారత్ మిషన్‌కు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. వీరిలో టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధనమ్ ఘెబ్రెయాస్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, ఏషియన్ డెవల్‌పమెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ మసాట్సుగు అసకవా, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ తదితరులు స్వచ్ఛ భారత్ మిషన్‌ను కొనియాడారు. ఇదిలావుంటే, బుధవారం జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, ఆలియా భట్, ఆర్. మాధవన్, మానుషి ఛిల్లార్, టిస్కా చోప్రా, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.