Share News

Mauritius: విదేశీ గడ్డపై తొలి జనఔషధి కేంద్రం.. జై శంకర్ చేతుల మీదుగా ప్రారంభం

ABN , Publish Date - Jul 19 , 2024 | 08:35 AM

విదేశీ గడ్డపై భారత తొలి జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. మారిషస్‌లో(Mauritius) గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్(Jai Shankar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌తో కలిసి జైశంకర్ జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు.

Mauritius: విదేశీ గడ్డపై తొలి జనఔషధి కేంద్రం.. జై శంకర్ చేతుల మీదుగా ప్రారంభం

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ గడ్డపై భారత తొలి జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. మారిషస్‌లో(Mauritius) గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్(Jai Shankar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌తో కలిసి జైశంకర్ జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు.

“తొలి విదేశీ జనఔషధి కేంద్రాన్ని ప్రధాని జుగ్నాథ్‌తో కలిసి ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ ఔషధి కేంద్రం ప్రారంభంతో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లైంది. భారత్-మారిషస్ ఆరోగ్య భాగస్వామ్యానికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి తక్కువ ఖర్చుతో కూడిన, మేడ్-ఇన్-ఇండియా ఔషధాలను సరఫరా చేస్తుంది”అని విదేశాంగ శాఖ మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


మారిషస్‌లో పర్యటనలో ఉన్న జైశంకర్.. గ్రాన్ బ్వా ప్రాంతంలో వైద్య క్లినిక్‌ని కూడా ప్రారంభించారు. భారత్‌లో తయారైన జనరిక్ మందులను ఇక్కడ తక్కువ ధరలకే అమ్మనున్నారు. 16 వేలకుపైగా రోగులకు చికిత్స అందించగల ఈ కేంద్రం ఇరు దేశాల సంబంధాలకు ప్రతీక అని జైశంకర్ పేర్కొన్నారు. ఇవే కాకుండా ప్రవింద్ కుమార్‌తో జైశంకర్ మరో 12 సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.


ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషించే లక్ష్యంతో మారిషస్‌లో జైశంకర్ పర్యటన రెండు రోజులపాటు కొనసాగింది. జైశంకర్ తన పర్యటనలో మారిషస్ ప్రధాని ప్రవింద్‌తోపాటు ఇతర సీనియర్ మంత్రులతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ప్రవింద్‌ ఇటీవల భారత్‌కు వచ్చిన తర్వాత ఈ పర్యటన జరిగింది. చివరిసారిగా 2021 ఫిబ్రవరిలో జైశంకర్ మారిషస్‌లో పర్యటించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 19 , 2024 | 08:46 AM