Share News

Yoga Day 2024: పర్వత శ్రేణుల నుంచి ఐఎన్ఎస్ విక్రమాదిత్య వరకు.. ఘనంగా యోగా దినోత్సవం

ABN , Publish Date - Jun 21 , 2024 | 05:05 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day 2024) ప్రపంచ దేశాలన్నీ ఘనంగా జరుపుకుంటున్నాయి. భారత్‌లో శుక్రవారం ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు యోగాసనాలు వేశారు.

Yoga Day 2024: పర్వత శ్రేణుల నుంచి ఐఎన్ఎస్ విక్రమాదిత్య వరకు.. ఘనంగా యోగా దినోత్సవం

ఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day 2024) ప్రపంచ దేశాలన్నీ ఘనంగా జరుపుకుంటున్నాయి. భారత్‌లో శుక్రవారం ఉదయం నుంచే అనేక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు యోగాసనాలు వేశారు.

కశ్మీర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా అన్ని రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఎత్తయిన పిర్‌పంజాల్ పర్వతశ్రేణిపై సైనికులు యోగాసనాలు వేశారు.


భారత నౌకాదళ సిబ్బంది ఐఎన్ఎస్ విక్రాంత్‌పై యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. 2015 నుంచి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో ఒక్కరోజు ఈ డేని జరుపుకోవాలన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదనకు 2014 సెప్టెంబర్‌లో ఐరాసలోని193 దేశాలు ఆమోదం తెలిపాయి.

Updated Date - Jun 21 , 2024 | 05:09 PM