Share News

Waqf Amendment Bill 2024: వక్ఫ్ బోర్డు బిల్లుపై 21 మంది సభ్యుల సమీక్ష.. లిస్టులో తెలుగు ఎంపీలు

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:57 PM

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024(Waqf Amendment Bill 2024)పై సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ నుంచి అధికార, ప్రతిపక్షానికి చెందిన 21 మంది సభ్యులు ఇందులో ఉంటారని ప్రకటించారు.

Waqf  Amendment Bill 2024: వక్ఫ్ బోర్డు బిల్లుపై 21 మంది సభ్యుల సమీక్ష.. లిస్టులో తెలుగు ఎంపీలు

ఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024(Waqf Amendment Bill 2024)పై సమీక్షించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) శుక్రవారం ఏర్పాటైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ నుంచి అధికార, ప్రతిపక్షానికి చెందిన 21 మంది సభ్యులు ఇందులో ఉంటారని ప్రకటించారు. అదనంగా ఈ కమిటీలో రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు కూడా ఉంటారని తెలిపారు. కిరణ్ రిజిజు ప్రతిపాదనను సభ్యులు ఆమోదించారు.

జేపీసీలో సభ్యులు ఎవరంటే..

1. జగదాంబిక పాల్

2. నిషికాంత్ దూబే

3. తేజస్వి సూర్య

4. అపరాజిత సారంగి

5. సంజయ్ జైస్వాల్

6. దిలీప్ సైకియా

7. అభిజిత్ గంగోపాధ్యాయ

8. డీకే అరుణ

9. గౌరవ్ గొగోయ్

10. ఇమ్రాన్ మసూద్


11. మహ్మద్ జావేద్

12. మౌలానా మొహిబుల్లా నద్వీ

13. కళ్యాణ్ బెనర్జీ

14. ఎ రాజా

15. లవు శ్రీ కృష్ణ దేవరాయలు

16. దిలేశ్వర్ కమైత్

17. అరవింద్ సావంత్

18. సురేష్ గోపీనాథ్

19. నరేష్ గణపత్ మ్హస్కే

20. అరుణ్ భారతి

21. అసదుద్దీన్ ఒవైసీ

తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఎంపీలు జేపీసీలో ఉన్నారు. టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయ, మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ, హైదరాబాద్ నుంచి మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 21 మంది లోక్ సభ సభ్యులకు జేపీసీలో చోటు దక్కింది.

Updated Date - Aug 09 , 2024 | 04:57 PM