Share News

Kamala Harris : డొనాల్డ్‌ ట్రంప్‌పై కమల పైచేయి

ABN , Publish Date - Jul 25 , 2024 | 05:51 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ తప్పుకోవటంతో ముందుకొచ్చిన కమలా హ్యారిస్‌.. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ప్రీపోల్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాయిటర్స్‌, ఇప్సాస్‌ సంస్థలు మంగళవారం నిర్వహించిన పోల్‌లో..

Kamala Harris : డొనాల్డ్‌ ట్రంప్‌పై కమల పైచేయి

ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం

వెల్లడిస్తున్న ప్రీ పోల్‌ సర్వేలు

వాషింగ్టన్‌, జూలై 24: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ తప్పుకోవటంతో ముందుకొచ్చిన కమలా హ్యారిస్‌.. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ప్రీపోల్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాయిటర్స్‌, ఇప్సాస్‌ సంస్థలు మంగళవారం నిర్వహించిన పోల్‌లో.. ట్రంప్‌నకు 42 పాయింట్లు లభించగా, కమలకు 44 లభించాయి. పీబీఎస్‌ న్యూస్‌, ఎన్‌పీఆర్‌, మారిస్ట్‌ సంయుక్తంగా నిర్వహించిన మరో సర్వేలో ట్రంప్‌, కమల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనబోతోందని వెల్లడైంది. ఈ సర్వేలో ట్రంప్‌నకు 46ు మంది మద్దతు లభించగా, కమలకు 45ు మంది ఓటర్లు మద్దతు తెలిపారు. పోటీ నుంచి బైడెన్‌ తప్పుకోవటం సరైన నిర్ణయమని పార్టీలకు, వయసులకు అతీతంగా పలువురు ఓటర్లు పేర్కొన్నట్లుగా ఈ సర్వే తెలిపింది. బైడెన్‌ నిర్ణయం వల్ల డెమోక్రటిక్‌ అభ్యర్థి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెరిగాయని దాదాపు 41ు మంది అభిప్రాయపడినట్లు వెల్లడించింది. కాగా, బరి నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్‌ ఆదివారం ప్రకటించిన తర్వాత కేవలం 2 రోజుల్లోనే కమలకు ఈ స్థాయిలో ప్రజాదరణ లభిస్తే.. ఎన్నికల నాటికి ట్రంప్‌పై ఆమె పూర్తి ఆధిపత్యం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వయసు పరంగా కూడా 78 ఏళ్ల ట్రంప్‌ కంటే 59 ఏళ్ల కమల వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు, దేశాధ్యక్షుడు బైడెన్‌ ఎన్నికల ప్రచారం కోసం సేకరించిన నిధుల్ని కమలా హారిస్‌ ఉపయోగించుకోవడం చట్టబద్ధం కాదంటూ ట్రంప్‌ ప్రచార బృందం ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌(ఎ్‌ఫఈసీ)కు ఫిర్యాదు చేసింది. బైడెన్‌ సేకరించిన 91.5 మిలియన్‌ డాలర్లను ఎన్నికల ప్రచార నిధుల్ని కమల వినియోగించుకోవాలనుకుంటున్నారు.

Updated Date - Jul 25 , 2024 | 07:16 AM