Share News

హడావుడిగా నా కుమార్తె అంత్యక్రియలు

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:56 AM

స్థానిక ఆర్‌.జి. కర్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌ దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురయిన సంఘటనపై దర్యాప్తు జరుగుతున్న తీరు సక్రమంగా లేదని ఆమె తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసుపై మమత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగులేదని అభిప్రాయపడ్డారు. తన కుమార్తె

హడావుడిగా నా కుమార్తె అంత్యక్రియలు

దీనిపై అనుమానాలున్నాయి: ట్రైనీ డాక్టర్‌ తండ్రి

కోల్‌కతా, ఆగస్టు 18: స్థానిక ఆర్‌.జి. కర్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌ దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురయిన సంఘటనపై దర్యాప్తు జరుగుతున్న తీరు సక్రమంగా లేదని ఆమె తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసుపై మమత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగులేదని అభిప్రాయపడ్డారు. తన కుమార్తె భౌతిక కాయాన్ని హడావిడిగా దహనం చేశారని, దీనిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. శ్మశానంలో అప్పటికే మూడు శవాలు ఉన్నప్పటికీ తన కుమార్తె భౌతిక కాయానికి ముందుగా దహన సంస్కారాలు చేశారని చెప్పారు. ‘‘న్యాయం చేస్తామని సీఎం అంటున్నారు. కానీ న్యాయం కోసం డిమాండు చేస్తున్న సామాన్యులను జైల్లో పెడుతున్నారు’’ అని వాపోయారు. ప్రస్తుతం సీబీఐ జరుపుతున్న దర్యాప్తు పట్ల కూడా ఆయన సంతృప్తి చెందలేదు. ‘‘దర్యాప్తు జరుగుతున్నా ఇంతవరకు ఎలాంటి ఫలితాలు వెల్లడి కాలేదు. డిపార్టుమెంటు తరఫునగానీ, కాలేజీ తరఫునగానీ ఒక్కరు కూడా మాకు సహకరించలేదు. మొత్తం డిపార్టుమెంటుకు ఇందులో ప్రమేయం ఉంది’’ అని ఆరోపించారు. న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తోందని చెప్పారు. ఒకప్పుడు వీధి పోరాటాలు చేసిన ముఖ్యమంత్రే ఇప్పుడు నిరసన ప్రదర్శనలను అడ్డుకుంటున్నారన్నారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం తీసుకోబోమని తెలిపారు.

Updated Date - Aug 19 , 2024 | 04:56 AM