Share News

National: ప్రారంభమైన టోల్‌ బాదుడు

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:52 AM

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్‌ చార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. టోల్‌చార్జీలను సగటున 5 శాతం పెంచుతూ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

National: ప్రారంభమైన టోల్‌ బాదుడు

  • సగటున 5 శాతం పెంచిన ఎన్‌హెచ్‌ఏఐ

  • ఔటర్‌పై వాహనదారులకు పెరగనున్న భారం

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పెరిగిన టోల్‌ చార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. టోల్‌చార్జీలను సగటున 5 శాతం పెంచుతూ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవంగా టోల్‌ చార్జీలను ఏప్రిల్‌ 1 నుంచే పెంచాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది.

ఈ విషయాన్ని కేంద్ర జాతీయ రహదారుల, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో టోల్‌ చార్జీల పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఎన్‌హెచ్‌ఏఐకు సూచించగా జూన్‌ 3 వరకు వాయిదా వేసింది. కాగా, ఎన్‌హెచ్‌ఏఐ తాజా నిర్ణయంతో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై టోల్‌ చార్జీలు పెరగనున్నాయి.

హెచ్‌ఎండీఏ నుంచి ఔటర్‌ లీజుకు తీసుకున్న ‘ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ టోల్‌ చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఔటర్‌పై ప్రయాణించే కార్లు, జీపులు, ఎస్‌యూవీల్లాంటి తేలికపాటి వాహనాల (ఎల్‌ఎంవీ) నుంచి గతంలో రూ. 2.01 వసూలు చేస్తుండగా ఇకపై రూ. 2.34 చొప్పున తీసుకోనున్నారు. ప్రస్తుతం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కోకాపేటకు ఓ కారుకు రూ. 40 టోల్‌ చార్జి వసూలు చేస్తుండగా తాజా పెంపుతో రూ. 50 వసూలు చేయనున్నారు.

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పెరిగిన టోల్‌ చార్జీ వివరాలు

(2024-25)

వాహనం (కి.మీకు రేటు)

కారు, జీపు, వ్యాను, ఎల్‌ఎంవీ, ఎస్‌యువీ, ఎంపీవీ 2.34

ఎల్‌సీవీ, మినీ బస్‌ 3.77

బస్‌/ టు యాగ్జిలర్‌ ట్రక్‌ 6.69

3 యాగ్జిల్‌ వాణిజ్య వాహనం 8.63

భారీ నిర్మాణ మిషనరీ/ఎర్త్‌మూవింగ్‌ ఎక్వి్‌పమెంట్‌, ట్రక్కులు 12.40

ఓవర్‌ సైజ్డ్‌ వాహనాలు (7 లేదా అంతకంటే ఎక్కువ యాగ్జిల్స్‌) 15.09

Updated Date - Jun 03 , 2024 | 06:52 AM