Share News

Heat Waves: ప్రజలకు హై అలర్ట్.. ఈ రాష్ట్రాలవారికి వడదెబ్బ ముప్పు

ABN , Publish Date - Apr 06 , 2024 | 05:58 PM

వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. అత్యవసరం అయితే తప్పా బయటకి వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.

Heat Waves: ప్రజలకు హై అలర్ట్.. ఈ రాష్ట్రాలవారికి వడదెబ్బ ముప్పు

ఢిల్లీ: వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. అత్యవసరం అయితే తప్పా బయటకి వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతాయని.. వివిధ రాష్ట్రాలకు వడగాలుల ముప్పు ఉందని ఐఎండీ అంచనా వేసింది.

వాటిల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాం తీర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, రాయలసీమ, బీహార్, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తర కర్ణాటక, ఒడిశా, విదర్భ సహా వివిధ రాష్ట్రాల్లో ఆది, సోమ వారాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

హీట్‌వేవ్‌తో పాటు ఏప్రిల్ 7, 8 తేదీలలో సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లలో వడగళ్ళ వాన కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలను ఐఎండీ అధికారులు విడుదల చేశారు.


కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. రాబోయే రెండున్నర నెలల్లో భారత్ తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటుందని అంచనా వేశామన్నారు. "ఇది మనందరికీ సవాలు విసిరే అంశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ప్రస్తుతం తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నందునా.. భారత్ అన్నింటికీ ముందుగానే సిద్ధం కావాలి.

Realme: రియల్‌మి స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మరో ఫోన్.. భారత్‌లో విడుదలకు రెడీ

ఎన్నికల సమయం కావడంతో పోలింగ్ సిబ్బంది ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలి" అని ఆయన అన్నారు. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ చీఫ్ మోహపాత్ర తెలిపారు.

దేశంలోని చాలా ప్రాంతాల్లో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. ఏప్రిల్-జూన్ కాలంలో చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పది నుంచి 20 రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2024 | 05:59 PM