Share News

NEET Exam: బిగ్ బ్రేకింగ్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా

ABN , Publish Date - Jun 22 , 2024 | 10:24 PM

నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లీకేజీపై పెద్ద రాద్ధాంతమే జరుగుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

NEET Exam: బిగ్ బ్రేకింగ్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా

న్యూ ఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లీకేజీపై పెద్ద రాద్ధాంతమే జరుగుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నాడు (జూన్-23న) జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్) వాయిదా వేయడం జరిగింది. పరీక్ష తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కాగా.. దేశవ్యాప్తంగా 300 నగరాల్లో వెయ్యికి పైగా పరీక్షా కేంద్రాల్లో నీట్ పీజీ- 2024 పరీక్ష జరగాల్సి ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్ష వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి లోనవుతున్నారు.

Updated Date - Jun 22 , 2024 | 10:28 PM