ఆగస్టు 14 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్
ABN , Publish Date - Jul 30 , 2024 | 12:56 AM
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) అండర్ గ్రాడ్యుయేట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను సోమవారం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి విడత కౌన్సెలింగ్కు రిజిస్ర్టేషన్ ఆగస్టు 14-21 వరకు ఉంటుంది. ఆప్షన్ల ఎంపికఆగస్టు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి), జూలై 29: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) అండర్ గ్రాడ్యుయేట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను సోమవారం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి విడత కౌన్సెలింగ్కు రిజిస్ర్టేషన్ ఆగస్టు 14-21 వరకు ఉంటుంది. ఆప్షన్ల ఎంపికఆగస్టు 16-20 వరకు ఉంటుంది. ఆగస్టు 23న సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 24-29 వరకు కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ర్టేషన్ సెప్టెంబరు 5-10 వరకు ఉండనుంది. సెప్టెంబరు 6-10 వరకు ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 13న సీట్ల కేటాయిస్తారు. సెప్టెంబరు 14-20 వరకు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. నాలుగు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్లో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 710 వైద్య కళాశాలల్లో సుమారు 1.10 లక్షల ఎంబీబీఎస్ సీట్లను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఆయుష్, నర్సింగ్ సీట్లతోపాటు 21వేల బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా ఇప్పటికే సవరించిన నీట్ ర్యాంకులను విడుదల చేశారు. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదల చేయనున్నారు. తొలుత ఆలిండియా కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, విద్యా సంస్థల్లోని 15ు సీట్లకు కౌన్సెలింగ్ ఉంటుంది. ఆలిండియా కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వారం తర్వాత మన దగ్గర ఎంబీబీఎస్ అడ్మిషన్లకు కాళోజీ హెల్త్ వర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.