Share News

New Rules : ఐదేళ్లు దాటితే కొత్త ఫాస్టాగ్‌

ABN , Publish Date - Aug 01 , 2024 | 06:21 AM

ఫాస్టాగ్‌ నిబంధనలు గురువారం నుంచి మారుతున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. మారిన నిబంధనలకు అనుగుణంగా వినియోగదారులు, ట్యాగ్‌ సేవలను అందిస్తున్న సంస్థలు చర్యలు తీసుకోవాలని

 New Rules : ఐదేళ్లు దాటితే  కొత్త ఫాస్టాగ్‌

మూడేళ్లు దాటితే కేవైసీ చేయించాలి

నేటి నుంచి నిబంధనల్లో మార్పు

అమలుకు అక్టోబరు 31 చివరి తేదీ

న్యూఢిల్లీ, జూలై 31: ఫాస్టాగ్‌ నిబంధనలు గురువారం నుంచి మారుతున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. మారిన నిబంధనలకు అనుగుణంగా వినియోగదారులు, ట్యాగ్‌ సేవలను అందిస్తున్న సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఐదేళ్లు దాటిన ట్యాగ్‌లన్నింటినీ కచ్చితంగా మార్చాలి. మూడేళ్లు దాటితే తప్పనిసరిగా కేవైసీ చేయించాలి. వాహనం రిజిస్ట్రేషన్‌, ఛాసిస్‌ నంబర్లతో ట్యాగ్‌ను అనుసంధానం చేయాలి. అలాగే ప్రతి ఫాస్టాగ్‌ ఒక మొబైల్‌ నంబరుతో అనుసంధానమై ఉండాలి. కొత్త వాహనమైతే కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు వాహనం నంబరును ఫాస్ట్‌ట్యాగ్‌ డేటాబే్‌సలో అప్‌డేట్‌ చేయించాలి. అలాగే వాహనం ముందు భాగం స్పష్టంగా కనిపించేలా ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. గడువు అక్టోబరు 31.

Updated Date - Aug 01 , 2024 | 06:21 AM