Share News

‘మిస్‌ ఇండియా - 2024’గా నిఖితా పోర్వాల్‌

ABN , Publish Date - Oct 18 , 2024 | 06:11 AM

‘ఫెమినా మిస్‌ ఇండియా- 2024’ కిరీటాన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖితా పోర్వాల్‌ దక్కించుకున్నారు. బుధవారం ముంబైలోని ఫేమస్‌ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో ఆమెను విజేతగా ప్రకటించారు. 60వ మిస్‌ ఇండియా విజేతగా నిలిచిన నిఖితా పోర్వాల్‌ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని. ఈ ఏడాది జరిగే ప్రపంచ

‘మిస్‌ ఇండియా - 2024’గా నిఖితా పోర్వాల్‌

మధ్యప్రదేశ్‌కు చెందిన యువతికి కిరీటం

రన్నరప్‌గా రేఖా పాండే

ముంబై, అక్టోబరు 17: ‘ఫెమినా మిస్‌ ఇండియా- 2024’ కిరీటాన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖితా పోర్వాల్‌ దక్కించుకున్నారు. బుధవారం ముంబైలోని ఫేమస్‌ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో ఆమెను విజేతగా ప్రకటించారు. 60వ మిస్‌ ఇండియా విజేతగా నిలిచిన నిఖితా పోర్వాల్‌ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని. ఈ ఏడాది జరిగే ప్రపంచ అందాల పోటీల్లో భారత్‌ తరుఫున నిఖిత ప్రాతినిధ్యం వహించనున్నారు. దాద్రా నగర్‌ హవేలీకి చెందిన రేఖా పాండే మొదటి రన్నర్‌పగా, గుజరాత్‌కు చెందిన ఽఆయుశీ ధోలాకియా రెండో రన్నర్‌పగా నిలిచారు. గత ఏడాది విజేత నందిని గుప్తా నిఖితకు మిస్‌ ఇండియా కిరీటాన్ని అందించారు. ఈ సందర్భంగా నిఖితా పోర్వాల్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఆనందాన్ని వర్ణించలేను. నా తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసి గర్వంగా ఉంది. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. సాధించవల్సిన విజయాలు చాలా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 06:11 AM