PM Modi: రాజ్‌కోట్ ప్రజలతో అనుబంధంపై.. ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Feb 24 , 2024 | 06:30 PM
గుజరాత్‌లోని రాజ్‌కోట్(Rajkot) నియోజకవర్గ ప్రజలతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఒకానొక కీలక సందర్భంలో నియోజకవర్గ ఓటర్లు వెన్నంటే నిలవటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఢిల్లీ: గుజరాత్‌లోని రాజ్‌కోట్(Rajkot) నియోజకవర్గ ప్రజలతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఒకానొక కీలక సందర్భంలో నియోజకవర్గ ఓటర్లు వెన్నంటే నిలవటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియోను ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. అది 2002 ఫిబ్రవరి 24.. ఇదే రోజు రాజ్‌కోట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మోదీ అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆయన 2001లోనే ముఖ్యమంత్రిగా బాధత్యలు స్వీకరించారు. సీఎం పదవిలో కొనసాగాలంటే 6 నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి ఉండింది. ఆ సమయంలో రాజ్‌కోట్‌కు ఉప ఎన్నిక రావడం.. మోదీ ఎన్నికల ప్రచారంలో విస్త్రతంగా పాల్గొని గెలుపొందడం.. అలా సీఎం పదవిని నిలబెట్టుకోవడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి.
అప్పటి నుంచి మోదీ రాజ్‌కోట్‌ను సెంటిమెంట్‌గా భావిస్తారని రాజకీయ నిపుణులు అంటుంటారు. ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ మోదీ ఆర్కైవ్ అనే ఎక్స్ హ్యాండిల్ సదరు వీడియోను షేర్ చేసింది. దీనికి మోదీ స్పందిస్తూ.. "రాజ్‌కోట్‌కు నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు. అది నాకు తొలి ఎన్నికల విజయం. వారిచ్చిన ప్రోత్సాహంతో అప్పటి నుంచి ప్రజా సేవలో నిమగ్నమయ్యాను" అని ప్రధాని తన అనుభవాలను పంచుకున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి