PM Modi: ఫలప్రదంగా చర్చలు.. త్వరలో మాల్దీవుల్లో ప్రధాని మోదీ పర్యటన
ABN , Publish Date - Oct 07 , 2024 | 06:03 PM
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుతో చర్చలు ఫలప్రదంగా కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
ఢిల్లీ: మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుతో చర్చలు ఫలప్రదంగా కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. "మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జును భారత్‌కు రావడాన్ని నేను స్వాగతిస్తున్నా. వాతావరణ మార్పు, నీటి వనరులు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఇరు దేశాలకు చెందిన కొన్ని రంగాలలో ఆర్థిక సంబంధాలు, కనెక్టివిటీ, సాంస్కృతిక అనుసంధానం, సహకారాన్ని మెరుగుపరచడానికి గల మార్గాలను ఈ సమావేశంలో చర్చించాం"అని మోదీ పేర్కొన్నారు. మాల్దీవుల్లో పర్యటించాల్సిందిగా మహమ్మద్ ముయిజ్జు ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
5 రోజుల పర్యటన..
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ద్వైపాక్షిక చర్చల కోసం తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టారు. సుమారు 12 మంది మంత్రులు, సీనియర్ అధికారులతో ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్న ముయిజ్జును కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతించారు. ఇంతకు ముందు జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముయిజ్జు హాజరయ్యారు. ఈసారి భారత్‌లో ఐదు రోజులు పర్యటించనున్న ముయిజ్జు.. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ముంబయి, బెంగళూరులో జరిగే పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఈ క్రమంలోనే ప్రధానిమోదీతో ముయిజ్జు సోమవారం సమావేశమయ్యారు. గతేడాది నవంబరులో ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్‌తో ఆ దేశ సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనా మద్దతుదారుగా పేరొందిన ముయిజ్జు.. తమ దేశంలోని భారత సైనికులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఢిల్లీ బయలుదేరే ముందు బీబీసీతో మాట్లాడిన ముయిజ్జు.. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మాల్దీవులకు భారత్ అండగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి...
KTR: మూసీ ఆర్భాటం ఎవరి కోసం.. కేటీఆర్ సూటి ప్రశ్న
Viral: భారతీయులకే జాబ్స్ ఇస్తున్నారు.. కెనడా శ్వేతజాతీయురాలి సంచలన ఆరోపణ
Bathukamma: ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా
Read Latest Telangana News And Telugu News