Share News

PM Modi: దయానంద సరస్వతి రాకతో బ్రిటిషర్ల కుట్రలు బహిర్గతం.. సేవల్ని గుర్తు చేసుకున్న మోదీ

ABN , Publish Date - Feb 11 , 2024 | 01:46 PM

స్వామి దయానంద సరస్వతి(Swami Dayanand Saraswati) రాకతో బ్రిటిషర్ల కుట్రలు బట్టబయలయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు దయానంద 200వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బీ జిల్లా టంకరాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ(PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

PM Modi: దయానంద సరస్వతి రాకతో బ్రిటిషర్ల కుట్రలు బహిర్గతం.. సేవల్ని గుర్తు చేసుకున్న మోదీ

గాంధీనగర్: స్వామి దయానంద సరస్వతి(Swami Dayanand Saraswati) రాకతో బ్రిటిషర్ల కుట్రలు బట్టబయలయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు దయానంద 200వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బీ జిల్లా టంకరాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ(PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. "బ్రిటిషర్లు భారతీయుల సాంఘిక దురాచారాలను పావుగా వాడుకుని కించపరిచారు. దయానంద రాక బ్రిటిషర్లకు గట్టి సమాధానంగా నిలిచింది. దయానంద సమాధానాలతో వారు తోక ముడిచారు. దయానంద.. మహిళలకు సమాన హక్కులు కావాలని పోరాడారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విద్యాలయాలు సమాజానికి అవసరం.

ఆర్యసమాజ్ పాఠశాలలు ఇలాంటి విద్యనందించడంలో కీలకంగా మారాయి. జాతీయ విద్యా విధానం ద్వారా దేశవ్యాప్తంగా వీటిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. తద్వారా సమాజాన్ని అనుసంధానించడం మా బాధ్యత. దయానంద్ సరస్వతి గుజరాత్‌లో జన్మించడం గర్వంగా భావిస్తున్నా" అని మోదీ అన్నారు. స్వామి దయానంద సరస్వతి ఫిబ్రవరి 12, 1824న టంకరాలో జన్మించారు. ఆయన జీవితాన్ని వేద జ్ఞానం, సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించడానికి అంకితం చేశారు. తన ఆలోచనలు, సందేశాల ద్వారా సమాజాన్ని శ్రేయస్సు, స్వేచ్ఛ, సమానత్వం వైపు నడిపించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 11 , 2024 | 02:05 PM