పూజా ఖేద్కర్‌పై వేటు
ABN , Publish Date - Aug 01 , 2024 | 06:02 AM
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ వేటు వేసింది. ట్రైనీ ఐఏఎ్‌సగా ఆమె ఎంపికను రద్దు చేయడంతో పాటు జీవితంలో మళ్లీ అన్ని ప్రవేశ పరీక్షలు/యూపీఎ్‌ససీ సెలెక్షన్స్‌లో పాల్గొనకుండా
ట్రైనీ ఐఏఎస్‌గా నియామకం రద్దు
మళ్లీ పరీక్షలు రాయకుండా నిషేధం
న్యూఢిల్లీ, జూలై 31: మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ వేటు వేసింది. ట్రైనీ ఐఏఎ్‌సగా ఆమె ఎంపికను రద్దు చేయడంతో పాటు జీవితంలో మళ్లీ అన్ని ప్రవేశ పరీక్షలు/యూపీఎ్‌ససీ సెలెక్షన్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధించింది. యూపీఎ్‌ససీకి పూజా ఖేద్కర్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం అధికారులు వెల్లడించారు. 34 ఏళ్ల పూజపై ఆరోపణల నేపథ్యంలో 2009-2023 మధ్య ఐఏఎస్ స్ర్కీనింగ్ ప్రక్రియను పూర్తి చేసిన 15 వేలమందికి పైగా అభ్యర్థుల డేటాను పరిశీలించినట్టు ప్యానల్ వెల్లడించింది.