Delhi: భారతీయుల రక్షణ మా మొదటి ప్రాధాన్యత.. ఇరాన్ - ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ మోదీ స్పష్టీకరణ
ABN , Publish Date - Apr 15 , 2024 | 08:36 AM
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో భారతీయుల రక్షణ తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో భారతీయుల రక్షణ తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. సిరియాలోని రాయబార కార్యాలయంపై వైమానిక దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇజ్రాయెల్ పై 300కి పైగా క్షిపణులు ప్రయోగించిన విషయం తెలిసిందే.
Elon Musk: 2032లో అమెరికా ఎన్నికల్లో ఏఐ కీలక భూమిక.. ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి ఎన్నికైతే, ఉద్రికత్తలు చెలరేగుతున్న ప్రాంతాలలో ఉన్న భారతీయుల జీవితాలకు భద్రత కల్పించడం తమ మొదటి ప్రాధాన్యం అని ఆయన స్పష్టం చేశారు. "ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి మేఘాలు కమ్ముకుంటున్నాయి. అనేక ప్రాంతాలు యుద్ధం లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచం ఉద్రిక్తంగా ఉంది. ప్రపంచ దేశాల్లో శాంతి లేదు. అటువంటి సమయాల్లో పౌరుల భద్రతకు భరోసా ఇవ్వడం అతి ముఖ్యమైన పని. మన ప్రజల భద్రతే మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది.
యుద్ధ భయం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో పూర్తి మెజారిటీతో బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఎన్నుకోవడం దేశ ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం, మరింత దృఢంగా మార్చే ప్రభుత్వం అవసరం. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ.. 'విక్షిత్ భారత్' (అభివృద్ధి చెందిన దేశం) దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి’’ అని మోదీ అన్నారు.
2023లో అక్టోబర్ 7న జరిగిన ఇజ్రాయెల్ - హమాస్ భయంకరమైన యుద్ధంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి కేంద్రం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. గతేడాది డిసెంబర్ వరకు 1,309 మంది భారతీయ పౌరులు, 14 OCI కార్డ్ హోల్డర్లు, 20 మంది నేపాలీలను 'ఆపరేషన్ అజయ్' కింద రక్షించారు.
రష్యా - ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను రక్షించడానికి కేంద్రం ఆపరేషన్ గంగా అనే మిషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో 25 వేల మంది భారతీయులను రక్షించగలిగారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్న తరుణంలో అక్కడ నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి రక్షించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి