Swati Maliwal: స్వాతి మలివాల్ గాయాలపై ఎయిమ్స్ నివేదిక
ABN , Publish Date - May 18 , 2024 | 01:55 PM
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి సంబంధించి అల్ ఇండియా మెడికల్ సైన్సెన్స్ (ఎయిమ్స్) శనివారం నివేదిక ఇచ్చింది. ఆమె ఎడమ కాలుతోపాటు కుడి చెంపకు గాయాలున్నాయని ఆ నివేదకలో ఎయిమ్స్ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, మే 18: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి సంబంధించి అల్ ఇండియా మెడికల్ సైన్సెన్స్ (ఎయిమ్స్) శనివారం నివేదిక ఇచ్చింది. ఆమె ఎడమ కాలుతోపాటు కుడి చెంపకు గాయాలున్నాయని ఆ నివేదకలో ఎయిమ్స్ స్పష్టం చేసింది. ఎడమ కాలుపై 3*2 సె.మీ, అలాగే కుడి చెంపపై కంటి సమీపంలో 2*2 సె.మీ మేర గాయాలున్నాయని ఆ నివేదకలో వివరించింది.
స్వాతి మలివాల్‌కు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ దాడి జరిగిన వెంటనే ఆమె నేరుగా పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. కానీ ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే ఆమె వెనుదిగారు.
అనంతరం స్వాతి మలివాల్ దాడి ఘటనను బీజేపీ తన ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకొంది. అందులోభాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. మరోవైపు గురువారం స్వాతి మలివాల్.. తనపై దాడి జరిగిందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే తీస్ హజారీ కోర్టులో శుక్రవారం తనపై దాడికి సంబంధించిన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట స్వాతి మలివాల్ ఇచ్చారు.
మే 13వ తేదీ.. అంటే సోమవారం సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వామి మలివాల్ ఆరోపించారు. ఆ క్రమంలో అతడు తన చెంపపై ఏడు ఎనిమిది సార్లు కొట్టాడన్నారు. అలాగే కాలుతో తనను బలంగా తన్నాడంటూ ఆమె ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇక స్వాతి మలివాల్ దాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ సుమోటోగా తీసుకున్నారు. మే 16వ తేదీ ఉదయం 11.00 గంటలకు తమ ప్యానెల్ ముందు హాజరు కావాలంటు నిందితుడు బిభవ్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. కానీ ఈ నోటీసులపై అతడు స్పందించకపోవడం గమనార్హం.
Read Latest AP News and Telugu News