ఆ పార్టీలది పాక్ ఎజెండా
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:27 AM
ఈ భూమ్మీద ఏ శక్తీ జమ్మూకశ్మీరుకు 370 అధికరణను పునరుద్ధరించలేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)లు పాకిస్థాన్ ఎజెండాను అనుసరిస్తున్నాయని విమర్శించారు. హింస, అశాంతే ఆ ఎజెండాగా పేర్కొన్నారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక ప్ర తిపత్తి కల్పించే 370,
370 పునరుద్ధరణా?.. భూమ్మీద ఏ శక్తీ చేయలేదు
కాంగ్రెస్, ఎన్‌సీపై మోదీ ఫైర్
కశ్మీరు భవితను నిర్దేశించే ఎన్నికలివి
అధికారం తమ జన్మహక్కని ఆ మూడు కుటుంబాల భావన
ఎన్నికల ప్రచారంలో ప్రధాని ధ్వజం
శ్రీనగర్, సెప్టెంబరు 19: ఈ భూమ్మీద ఏ శక్తీ జమ్మూకశ్మీరుకు 370 అధికరణను పునరుద్ధరించలేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)లు పాకిస్థాన్ ఎజెండాను అనుసరిస్తున్నాయని విమర్శించారు. హింస, అశాంతే ఆ ఎజెండాగా పేర్కొన్నారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక ప్ర తిపత్తి కల్పించే 370, 35ఏ అధికరణలను, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న అంశాలపై తమ ప్ర భుత్వం, కాంగ్రె్‌స-ఎన్‌సీ కూటమి ఒకే వైఖరితో ఉన్నాయని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి గెలిచే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయని పాక్ రక్షణ మంత్రి ఖవజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం శ్రీనగర్, కట్రా సభల్లో ప్రసంగించారు. ‘కాంగ్రె్‌సకు వేసే ప్రతి ఓటూ ఎన్‌సీ, పీడీపీల మేనిఫెస్టోల అమలుకు అవకాశం కల్పిస్తుంది. 370ని పునరుద్ధరించి మళ్లీ హింస, రక్తపాతాల కాలం తీసుకొస్తామని ఆ పార్టీలు హామీ ఇస్తున్నాయి. కాంగ్రె్‌స-ఎన్‌సీ పొత్తుపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ పొరుగుదేశం మాత్రం తెగ సంతోషిస్తోంది. ఆసిఫ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్, ఎన్‌సీ బండారం బయటపడింది’ అని చెప్పారు. ఈ ఎజెండాతోనే జమ్మూకశ్మీరులో పలు తరాలను నాశ నం చేసి నెత్తుటేర్లలో ముంచింది. పాక్‌కు తీవ్ర హెచ్చరిక చేస్తున్నా.. దాని ఎజెండాను ఇక్కడ అమ లు కానివ్వం. భూమ్మీద ఏ శక్తీ 370ని తిరిగి తీసుకురాలేదు’ అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కుటుంబ పార్టీలని.. ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవడం తమ జన్మహక్కుగా ఆ మూడు కుటుంబాలు భావిస్తాయని చెప్పారు. యువతను విద్య, ఉపాధికి దూరం చేసి.. రాళ్లు వారి చేతుల్లో పెట్టారని మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీ య ప్రయోజనాల కోసం యువత భవితను నాశనం చేశాయన్నారు. అవి మరో తరాన్ని నాశనం చేయడాన్ని తాను అనుమతించనని శపథం చేశారు. ‘ఈ కేంద్ర పాలిత ప్రాంతమంతటా స్కూళ్లు, కాలేజీలు సజావుగా నడుస్తున్నాయి. పిల్లల చేతుల్లో పుస్తకాలు, కలాలు, ల్యాప్‌టా్‌పలు ఉంటున్నాయి. స్కూళ్లలో కాల్పులు జరిగాయన్న వార్తలు ఇవాళ లేవు. కొత్త పాఠశాలలు, కళాశాలలు, ఎయిమ్స్, వైద్య కళాశాలలు, ఐఐటీలు నిర్మిస్తున్నాం. అందుకే ఈ మూడు కుటుంబాలను ఇప్పటి యువత సవాల్ చేస్తోంది. వాటికి వ్యతిరేకంగా గళం విప్పగలుగుతోంది. కశ్మీరు యువతకు ఉపాధి అవకాశాల కల్పన మోదీ లక్ష్యం, హామీ’ అని స్పష్టం చేశారు.
రాహుల్, పాకిస్థాన్ ఒక్కటే: బీజేపీ
పాక్ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విరుచుకుపడ్డారు. ఇది కాంగ్రెస్ వైఖరిని బట్టబయలు చేసిందని.. ఆ పార్టీ జాతి వ్యతిరేకత శక్తులతోనే తరచూ కలిసి పని చేస్తుంటుందని ఆరోపించారు. వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రయిక్స్‌కు రుజువులు అడగడం.. భారత సైన్యం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంలో రాహుల్‌గాంధీ, పాక్‌ల వాణి ఎప్పుడూ ఒకటేనన్నారు. 370 అధికరణ ముగిసిన అధ్యాయమని.. దానిని తిరిగి తీసుకురావడం ఎవరి తరమూ కాదని తేల్చిచెప్పారు.
మోదీ అమెరికా పర్యటనలో ట్రంప్‌తో భేటీపై సస్పెన్స్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి అమెరికాలో జరిపే పర్యటనలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా అనేక సమావేశాలు ఖరారయ్యాయని, మరికొన్నింటిని ఖరారు చేయా ల్సి ఉందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్త్రీ చెప్పారు. ఏదైనా ప్రత్యేక సమావేశం ఖరారు అవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని, ప్రధాని జరపబోయే మరిన్ని సమావేశాలను ఖరారు చేసేందుకు అన్ని విధాలా యత్నిస్తున్నా మన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ట్రంప్ వచ్చేవారం మోదీని అమెరికాలో కలుస్తానని రెండు రోజుల క్రితం ప్రకటించడంతో మిస్త్రీ స్పందనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నెల 21 నుంచి 23 వరకు ప్రధాని అమెరికాలో పర్యటిస్తారు.