పూరీ రత్నభాండాగారంలో పురాతన ఆయుధాలు
ABN , Publish Date - Jul 21 , 2024 | 06:18 AM
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారం నుంచి విలువైన వస్తువుల తరలింపు సందర్భంగా గత యుద్ధాల్లో ఉపయోగించిన కత్తులు, ఈటెలు, బరిశెలు వంటి పురాతన ఆయుధాలు బయటపడ్డాయి. లోపలి గదిలోని చెక్కపెట్టెల వద్ద ఈ ఆయుధాలు కనిపించాయని,
భువనేశ్వర్, జూలై 20: పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారం నుంచి విలువైన వస్తువుల తరలింపు సందర్భంగా గత యుద్ధాల్లో ఉపయోగించిన కత్తులు, ఈటెలు, బరిశెలు వంటి పురాతన ఆయుధాలు బయటపడ్డాయి. లోపలి గదిలోని చెక్కపెట్టెల వద్ద ఈ ఆయుధాలు కనిపించాయని, అవన్నీ చాలా బరువుగా ఉండి నలుపు రంగులోకి మారాయని ట్రెజరీలోకి ప్రవేశించిన కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. యుద్ధ సామగ్రిని తాత్కాలిక స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచామని కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఆలయ సేవకుడు శ్యామ మహాపాత్ర మాట్లాడుతూ, జగన్నాథ ఆలయంపై దుండగులు 18సార్లు దాడులు జరిపి, ఇక్కడి సంపదను దోచుకున్నారని చెప్పారు. ప్రసుతం లభించిన పురాతాన ఆయుధాలను అప్పటి రాజులు రత్నభాండాగారంలో దాచి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.