Share News

Trending: ప్రపంచ వారసత్వ దినోత్సవం అంటే ఏమిటి.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:01 PM

ఒక సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాలు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఇందులో వారసత్వం ( Special Story ) అనే అంశం ప్రధాన పాత్ర పోషిస్తుంది. వారసత్వం అనేది జీవి మనుగడకే కాకుండా సమాజ మనగుడకూ మైలురాయిగా నిలుస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే రాజరికం వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా వేళ్లూనుకుని ఉంది.

Trending: ప్రపంచ వారసత్వ దినోత్సవం అంటే ఏమిటి.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..

ఒక సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాలు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఇందులో వారసత్వం ( Special Story ) అనే అంశం ప్రధాన పాత్ర పోషిస్తుంది. వారసత్వం అనేది జీవి మనుగడకే కాకుండా సమాజ మనగుడకూ మైలురాయిగా నిలుస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే రాజరికం వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా వేళ్లూనుకుని ఉంది. కాలం మారుతున్న కొద్దీ ఆ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నాటి రాజులు కట్టించిన కట్టడాలు, నిర్మాణాలు ఆ ప్రాంతానికి విశేష ప్రాధాన్యత కలిగించాయి. ఇవే కాకుండా సహజంగా ఏర్పడిన ప్రకృతి అద్భుతాలూ ఉన్నాయి. వీటి ప్రాముఖ్యతను పరిరక్షించి తరతరాలకు అంతే భద్రంగా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే వారసత్వ కట్టడాలు, స్మారక కట్టడాలకు భద్రత చాలా అవసరం. కాబట్టి ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.


Election commission: పోలింగ్ రోజు పర్యటన.. బెంగాల్ గవర్నర్‌కు ఈసీ బ్రేక్..

చరిత్రలోని కట్టడాలు, నేటికీ సజీవంగా నిలిస్తున్న సాక్ష్యాలను పరిరక్షించుకోవడం ప్రపంచ వారసత్వ దినోత్సవ ముఖ్య లక్ష్యం. 1982లో ది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐసీఓఎమ్ఓఎస్) ఏటా ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పాటించాలని ప్రతిపాదించింది. మరుసటి ఏడాది యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్‌లో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. అప్పటి నుంచి ఏటా ఏప్రిల్ 18న ప్రత్యేక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మానవ కార్యకలాపాలు, ప్రకృతి వైపరీత్యాలు, పట్టణీకరణ కారణంగా వారసత్వ స్మారక చిహ్నాలు, ప్రదేశాలు తరచూ ధ్వంసమవుతున్నాయి. కాబట్టి వీటి రక్షణే ధ్యేయంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.


Sandeshkhali: సందేశ్‌ఖాళిలో షేక్ షాజహాన్ అండ్ కో ఆగడాలు.. ఎన్‌హెచ్ఆర్సీ రిపోర్టులో సంచలన విషయాలు

వైవిధ్యాన్ని కనుగొనండి- అనుభవించండి అనే నినాదాన్ని ఈ ఏడాది థీమ్ గా నిర్ణయించారు. సహజ ప్రకృతి దృశ్యాలు, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక పద్ధతులు, సంప్రదాయాలు, ఆచారాలు, పురాతన శిధిలాలు ప్రపంచ వారసత్వంలో భాగం. వాటిని కాపాడుకోవడం ముఖ్యం. ఈ వారసత్వ ప్రదేశాలు ప్రత్యేక పర్యాటక స్థలాలుగా ఆకర్షిస్తున్నాయి. అంతే కాకుండా స్థానిక ప్రభుత్వానికి ఆర్థికంగా సహాయపడతాయి.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 18 , 2024 | 12:01 PM