Share News

వైద్య పురోగతుల బాటలో...

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:27 AM

కొత్త మందుల అభివృద్ధి, చికిత్సా విధానాల పరంగా 2014లో వైద్యరంగం ఎంతో పురోగతిని సాధించింది.

వైద్య పురోగతుల బాటలో...

జన్యుపరమైన బధిర పిల్లలకు వినికిడిశక్తిని తిరిగి తీసుకురావడం మొదలు స్కిజోఫ్రేనియాకు కొత్త మందు వరకూ 2024 సంవత్సరంలో వైద్యరంగం ఎన్నో పురోగతులను సాధించింది. వాటి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం!

కొత్త మందుల అభివృద్ధి, చికిత్సా విధానాల పరంగా 2014లో వైద్యరంగం ఎంతో పురోగతిని సాధించింది. ఆటోఇమ్యూన్‌ వ్యాధికి కారణాన్ని కనుగొంది. చివరి దశకు చేరుకున్న అవయవ వైఫల్యానికి అత్యాధునిక ఔషధాన్ని అభివృద్ధి చేసి, సదరు రోగుల్లో ఆశలు చిగురింపజేసింది. ఇలా వైద్యరంగం సాధించిన మరిన్ని పురోగతులు ఏవంటే..

బధిర పిల్లల్లో కొత్త ఆశలు

వంశపారంపర్యంగా వినికిడిలోపాన్ని వెంట తెచ్చుకున్న పిల్లలు జన్యు థెరపీ ద్వారా ఆ లోపాన్ని అధిగమించగలుగుతున్నట్టు ది లాన్సెట్‌ అనే మెడికల్‌ జోర్నల్‌లో ప్రచురించిన ఒక వైద్య ప్రయోగం ఫలితం పేర్కొంటోంది. బోస్టన్‌లోని ఒక ఆస్పత్రిలో జన్యుపరమైన వ్యాధి మూలంగా వినికిడి శక్తిని కోల్పోయిన ఆరుగురు పిల్లల మీద పరిశోధకులు ప్రయోగాలు చేపట్టారు. జన్యు పరివర్తన ఫలితంగా చెవి నుంచి మెదడుకు శబ్ద సందేశాలు ప్రసారం కాలేని పరిస్థితి నెలకొన్నప్పుడు ‘డిఎ్‌ఫఎన్‌బి9’ అనే వినికిడి లోపం తలెత్తుతుంది. పనిచేసే జన్యు వెర్షన్‌ను మోసుకెళ్లే వైర్‌సను లోపలి చెవిలో ప్రవేశపెట్టడం ద్వారా, వినికిడి లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు, 26 వారాల తదనంతరం ఆరుగురిలో ఐదుగురు పిల్లలు వినికిడి శక్తిని తిరిగి పొందగలిగారు. ఇప్పటివరకూ ఇలాంటి వినికిడిలోపం కలిగిన పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ ఒక్కటే ఏకైక ప్రత్యామ్నాయంగా ఉండేది. కానీ తాజా పురోగతితో పిల్లలు వినికిడి శక్తిని పొందడంతో పాటు, మాట్లాడగలుగుతారు. ఈ ప్రయోగ విజయంతో ఇతరత్రా జన్యుపరమైన కారణాల వల్ల తలెత్తే వినికిడి శక్తి లోపాలను సరిదిద్దే చికిత్సలకు మార్గం సుగమం అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

పంది మూత్రపిండ మార్పిడి

2024 మార్చిలో, మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌లోని సర్జన్లు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జన్యుపరంగా సరిదిద్దిన పంది మూత్రపిండాన్ని విజయవంతంగా మనిషికి అమర్చగలిగారు. మూత్రపిండాలు విఫలమైనప్పుడు మూత్రపిండాల మార్పిడిని వైద్యులు ఎంచుకుంటూ ఉంటారు. అయితే అవయవాల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులో పంది మూత్రపిండాల్ని అమర్చే వెసులుబాటును వైద్యులు ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరిగింది. అయితే ఇదే ఏడాది మేలో మూత్రపిండం స్వీకర్త ప్రాణాలు కోల్పోయినప్పటికీ, మూత్రపిండ మార్పిడి వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని నిర్థారించే ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు ప్రకటించారు. అయితే కొత్త అవయవాల కోసం వేచి చూస్తున్న రోగులకు చికిత్సను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అవయవ మార్పిడిలో భాగంగా జంతు అవయవాలను ఉపయోగించినప్పుడు, రోగులకు అందించే ఉత్తమ సంరక్షణ గురించి తాము తెలుసుకోగలిగినట్టు, ఎమ్‌జిహెచ్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మెడికల్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ లెనార్డో రీలా వివరించారు.


లూపస్‌ కారణం తెలిసింది

లూపస్‌ రుగ్మతలో శరీర రోగనిరోధక వ్యవస్థ, పొరపాటున సొంత ఆరోగ్య కణాలు, కణజాలాల మీద దాడికి పాల్పడుతూ ఇన్‌ఫ్లమేషన్‌ను కలిగిస్తూ, అవయవాలు, వ్యవస్థలను దెబ్బతీస్తూ ఉంటుంది. బర్మింగ్‌హ్యామ్‌ అండ్‌ విమెన్స్‌ హాస్పిటల్‌ అండ్‌ నార్త్‌వెస్టర్న్‌ మెడిసిన్‌కు చెందిన వైద్యుల బృందం, ఇలాంటి ఆటోఇమ్యూన్‌ లూపస్‌ వ్యాధికి అసలు కారణాన్నీ, దాన్ని సరిదిద్దే మార్గాన్నీ కనుగొంది. 19 మంది లూపస్‌ రోగులు, 19 మంది ఆరోగ్యకరమైన వ్యక్తుల రక్త నమూనాలను సరిపోల్చిన పరిశోధకులు, లూపస్‌ రోగులు ఉత్పత్తి చేసే టి కణాల్లో అసమతౌల్యాలున్నట్టు గుర్తించారు. వ్యాధికి స్పందించే శరీర వ్యాధినిరోధక స్పందనలో టి సెల్స్‌ అనే ఒక రకం తెల్ల రక్తకణాలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ కణాల అసమతౌల్యాలను సరిదిద్దే నిర్దిష్ట మీడియేటర్లను కనిపెట్టగలిగినట్టు పరిశోధకులు చెప్తున్నారు.

కొత్త రకం స్కిజోఫ్రేనియా మందు

గత సెప్టెంబరులో ఎఫ్‌డిఎ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌) 30 ఏళ్లకు స్కిజోఫ్రేనియాతో బాధపడే రోగుల కోసం ఒక కొత్త తరం ఔషధాన్ని ఆమోదించింది. కొబెన్‌ఫీ, అనే ఈ మాత్ర చిత్తభ్రమ, మతిభ్రమణం లాంటి స్కిజోఫ్రేనియా లక్షణాల నియంత్రణకు తోడ్పడినట్టు వైద్య ప్రయోగాల్లో నిరూపణ అయింది. ఏళ్ల తరబడి శ్రమకోడ్చి కనుగొన్న స్కిజోఫ్రేనియా మొదటి తరం మందులు, డోపమైన్‌ రిసెప్టార్లను అడ్డుకోవడం ద్వారా సైకోసి్‌సను నియంత్రించగలుగుతున్నాయి. అయితే ఇలా డోపమైన్‌ రిసెప్టార్లను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అడ్డుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలను భరించవలసి వస్తోంది. ఈ మందులు, రోగుల శక్తిని సన్నగిల్లేలా చేయడంతో పాటు, మానసిక కుంగుబాటుకు లోను చేసి, వారిలో పార్కిన్సోనియన్‌ దుష్ప్రభావాలను కూడా కనబరుస్తున్నాయి. కానీ అధునాతనమైన కొబెన్‌ఫీ ఔషధం డోపమైన్‌ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం కనబరచకపోవడం విశేషం. కాబట్టి వేలమంది స్కిజోఫ్రేనియా రోగులకు ఈ మందును సూచించే ముందు, దీని ప్రభావాన్ని నిర్థారించుకోవడంతో పాటు, వీలైనంత తక్కువ దుష్ప్రభావాలు కలిగి ఉండేలా ఔషధాన్ని పర్యవేక్షించవలసిన అవసరం ఉందని వైద్యులు భావిస్తున్నారు.

జన్యు పరివర్తన ఫలితంగా చెవి నుంచి మెదడుకు శబ్ద సందేశాలు ప్రసారం కాలేని పరిస్థితి నెలకొన్నప్పుడు ‘డిఎ్‌ఫఎన్‌బి9’ అనే వినికిడి లోపం తలెత్తుతుంది. పనిచేసే జన్యు వెర్షన్‌ను మోసుకెళ్లే వైర్‌సను లోపలి చెవిలో ప్రవేశపెట్టడం ద్వారా, వినికిడి లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు, 26 వారాల తదనంతరం ఆరుగురిలో ఐదుగురు పిల్లలు వినికిడి శక్తిని తిరిగి పొందగలిగారు.

Updated Date - Dec 31 , 2024 | 04:27 AM