సర్జరీ తర్వాత... ఒక్క రోజులో ఇంటికి
ABN , Publish Date - Sep 17 , 2024 | 05:02 AM
కీలు మార్పిడి కోసం రోజుల తరబడి ఆస్పత్రుల్లో గడిపే రోజులకు కాలం చెల్లింది. ఒక్క రోజులో కీలు మార్పిడి చేయించుకుని, ఇంటికెళ్లిపోగలిగే ఆధునిక సర్జరీలు అందుబాటులోకొచ్చాయి. ఆ సర్జరీలు, వాటికి ఉండవలసిన అర్హతల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
కీలు మార్పిడి కోసం రోజుల తరబడి ఆస్పత్రుల్లో గడిపే రోజులకు కాలం చెల్లింది.
ఒక్క రోజులో కీలు మార్పిడి చేయించుకుని, ఇంటికెళ్లిపోగలిగే ఆధునిక సర్జరీలు అందుబాటులోకొచ్చాయి.
ఆ సర్జరీలు, వాటికి ఉండవలసిన అర్హతల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
కీలు మార్పిడి కోసం రోజుల తరబడి ఆస్పత్రుల్లో గడిపే రోజులకు కాలం చెల్లింది.
ఒక్క రోజులో కీలు మార్పిడి చేయించుకుని, ఇంటికెళ్లిపోగలిగే ఆధునిక సర్జరీలు అందుబాటులోకొచ్చాయి.
ఆ సర్జరీలు, వాటికి ఉండవలసిన అర్హతల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
సర్జరీ తదనంతర తేలికగా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉంటే, ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం కోసం, రోగి త్వరగా కోలుకుని, దైనందిన జీవితానికి అలవాటు పడిపోవడం కోసం 24 గంటల్లో కీలు మార్పిడి చేయించుకుని, నడుచుకుంటూ ఇంటికి వెళ్లగలిగే, డే కేర్ జాయింట్ రీప్లే్‌సమెంట్ సర్జరీలు అందుబాటులో కొచ్చాయి. పూర్తి కీలు మార్పిడి, పాక్షిక కీలు మార్పిడి, డైరెక్ట్ యాంటీరియర్ హిప్ రీప్లే్‌సమెంట్, రోబోటిక్ అసెస్టెడ్ సర్జరీ మొదలైన సింగిల్ సైడ్ (ఒక కాలి సర్జరీ) సర్జరీలకు రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండవలసిన అవసరం లేదు. ఇవన్నీ చిన్న కోతతో పూర్తయ్యే సర్జరీలు కాబట్టి 24 గంటల్లోనే నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవచ్చు. ఉదాహరణకు తుంటి సర్జరీ వెనక నుంచి, పక్క నుంచి ముందు నుంచి చేయవచ్చు. డైరెక్ట్ యాంటీరియర్ హిప్ రీప్లే్‌సమెంట్‌లో కండరాలను కత్తిరించకుండా, చిన్న కోతతో సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ సర్జరీ చేయించుకున్న వాళ్లు తదనంతరం ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. వీళ్లు నేల మీద కూర్చోవచ్చు. పద్మాసనం వేయవచ్చు. ఈ తరహా సర్జరీలు కూడా డే కేర్ జాయింట్ రీప్లే్‌సమెంట్ సర్జరీల కోవలోకే వస్తాయి. కొవిడ్ తర్వాత ఎవ్యాస్క్యులర్ నెక్రోసి్‌సకు గురయ్యే యువత సంఖ్య కూడా పెరిగింది. వీళ్లలో తుంటి ఎముక దెబ్బతిన్నప్పుడు సర్జరీతో మార్పిడి చేయవలసి వస్తుంది. ఇది కూడా డే కేర్ సర్జరీ కోవకే చెందుతుంది.
సూటయ్యే వారికే...
రెండు వైపులా రెండు కాళ్లకూ సర్జరీ చేసినప్పుడు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం కలిగి ఉన్న వ్యక్తులకు కీలు మార్పిడి సర్జరీలు చేసినప్పుడు, వాళ్లను ఒక్క రోజులోనే ఇంటికి పంపించడం సాధ్యపడదు. ఇవేవీ లేకుండా, ఆర్థ్రయిటిస్ ఉండి, సింగిల్ జాయింట్ మార్పిడి చేయించుకోవాలనుకున్నవాళ్లు డే కేర్ జాయింట్ రీప్లే్‌సమెంట్ సర్జరీని ఎంచుకోవచ్చు. మరీ ముఖ్యంగా సర్జరీ తర్వాత నొప్పిని కొంత మేరకు తట్టుకోగలిగి ఉండి, ఇతరుల సహాయం లేకుండా బాత్రూమ్‌కు వెళ్లి రాగలిగి, కుర్చీలో కూర్చోగలిగే వ్యక్తులను మాత్రమే వైద్యులు ఈ తరహా సర్జరీలకు ఎంచుకుంటారు. అయితే అందుకోసం సర్జరీకి ముందే వైద్యుల బృందం రోగికి పెయిన్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీలను నేర్పించడంతో పాటు సర్జరీ కోసం చిన్న కోతతో కూడిన రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలను ప్లాన్ చేస్తుంది.
బహుళ ప్రయోజనాలు
ఆస్పత్రిలో ఎక్కువ రోజుల పాటు వైద్యులు పర్యవేక్షణలో ఉండి, పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇంటికి వెళ్లడం మేలనే అపోహలు సర్వత్రా ఉంటాయి. కానీ ఆస్పత్రి నుంచి ఎంత వీలైతే అంత త్వరగా డిశ్చార్జ్ అయిపోయి, ఇంటికి చేరుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. నిజానికి రీప్లే్‌సమెంట్ సర్జరీల విషయంలో సర్జరీ తర్వాత వైద్యుల పర్యవేక్షణ అవసరం ఉండదు. అన్ని విధాలా సూట్ అయ్యే రోగులను ఇలాంటి సర్జరీలకు ఎంచుకుంటారు కాబట్టి సర్జరీ తదనంతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండవు. పైగా ఒక్క రోజులో డిశ్చార్జ్ అయిపోవడం వల్ల, ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు ఉండవు. ఆస్పత్రి ఖర్చులు కూడా తగ్గుతాయి. ఒక్క రోజులో సర్జరీ చేయించుకుని ఇంటికి చేరుకోవడంతో రోగుల్లో ఆత్మవిశ్వాసం, కోలుకునే వేగం పెరుగుతాయి. సర్జరీ తదనంతర నొప్పి విషయంలో కూడా వైద్యులు, ముందుగానే రోగుల స్వభావాన్ని అంచనా వేస్తారు. పెయిన్ టాలరెన్స్ స్కోర్స్ ఆధారంగా రోగుల వ్యక్తిగత స్వభావాలను బట్టి సర్జరీకి తగిన వ్యక్తులనే వైద్యులు ఎంచుకుంటారు. కాబట్టి ఆస్పత్రిలో రీఎడ్మిషన్ సమస్య తప్పుతుంది.
డాక్టర్ కృష్ణ కిరణ్
ఆర్థొపెడిక్ సర్జన్,
మెడికవర్ హాస్పిటల్స్,
హైదరాబాద్.