Apple Cedar : ‘యాపిల్ సెడార్’తో ప్రయోజనాలెన్నో..!
ABN , Publish Date - May 30 , 2024 | 05:30 AM
యాపిల్ సెడార్ వెనిగర్ (ఎసివి)తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అంతర్గతంగా, బహిర్గతంగా రెండు విధాలా ప్రయోజనకారిగా ఉండే యాపిల్ సెడార్ వెనిగర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం!
యాపిల్ సెడార్ వెనిగర్ (ఎసివి)తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అంతర్గతంగా, బహిర్గతంగా రెండు విధాలా ప్రయోజనకారిగా ఉండే యాపిల్ సెడార్ వెనిగర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం!
మచ్చలు మాయం: ఎసివి, నీళ్లు సమపాళ్లలో తీసుకుని, కలిపి ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖం మీద అద్దుకోవాలి. కొద్ది నిమిషాలు ఆగిన తర్వాత చల్ల నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారినికి రెండు సార్లు చేస్తే, ముఖం మీది మచ్చలు తొలగిపోతాయి.
నోటి దుర్గంధం: బేకింగ్ సోడాతో బ్రష్ చేసుకుని నోటిని పుక్కిలించిన తర్వాత, ఎసివితో పుక్కిలించాలి. తర్వాత మళ్లీ నీళ్లతో నోరు పుక్కిలిస్తే నోటి దుర్గంధం తొలగిపోతుంది.
శరీర దుర్గంధం: ఎసివిలో దూదిని ముంచి, బాహుమూలల్లో రుద్దుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత స్నానం చేసేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే శరీర దుర్గంధం తగ్గుతుంది.
చుండ్రు: ఎసివి, నీళ్లను కలిపి ఒక సీసాలో నింపుకోవాలి. ఈ నీటిలో దూదిని ముంచి, చుండ్రు ఉన్న చోట అద్దుకోవాలి. తర్వాత ఐదు నిమిషాల పాటు మర్దన చేసి, 15 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. తలస్నానానికి షాంపూ ఉపయోగించకూడదు.
కొవ్వు: శరీరంలో పేరుకున్న మొండి కొవ్వు కరగడం కోసం, మూడు వంతులు ఎసివికి ఒక వంతు ఆలివ్ నూనె కలిపి కొవ్వు ఉన్న చోట రోజుకు రెండుసార్లు మర్దన చేయాలి.
అధిక బరువు: రెండు టీస్పూన్ల ఎసివి, అర గ్లాసు నీళ్లలో కలిపి భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే అధిక బరువు అదుపులోకొస్తుంది.
తెల్లని పళ్ల కోసం: ఉదయాన్నే అరకప్పు నీళ్లలో ఒక టీస్పూను ఎసివి కలిపి పుక్కిలించి, తర్వాత బ్రష్ చేస్తే, దంతాలు తెల్లబడతాయి.
పాదాలు మృదువుగా: నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల ఎసివి కలిపి, 15 నిమిషాల పాటు పాదాలను ముంచి ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేస్తే పాదాల పగుళ్లు మెత్తబడి, మృతచర్మం ఊడిపోతుంది. పాదాల్లో ఫంగస్ కూడా తొలగిపోతుంది.
వెంట్రుకల మెరుపు కోసం: ఎసివి, నీళ్లు సమపాళ్లలో కలుపుకుని, తలస్నానం చేసిన తర్వాత ఈ నీళ్లతో వెంట్రుకలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలు మెరుపును సంతరించుకుంటాయి.
గొంతు నొప్పి: గ్లాసు నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ ఎసివి, ఒక టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ నీళ్లతో రోజుకు నాలుగుసార్లు నోరు పుక్కిలించాలి. ఇలా చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
ఎముకల దృఢత్వం కోసం: భోజనానికి ముందు లేదా తర్వాత ఒక టీస్పూను ఎసివి తాగితే, ఎముకలు దృఢంగా మారతాయి. యాపిల్ సెడార్ వెనిగర్ శరీరం క్యాల్షియంను శోషించుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫలితంగా ఎముకలు బలపడతాయి.