అదిరిపోయే... అటాచ్డ్ దుపట్టా
ABN , Publish Date - Feb 07 , 2024 | 03:47 AM
దుపట్టాలను విడిగా సింగారించుకునే రోజులు పోయాయి. జారిపోకుండా సర్దుకునే శ్రమ లేకుండా, డ్రస్‌కు కలిపి కుట్టినట్టుండే అటాచ్డ్ దుపట్టాలు తాజా ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి. వాటి మీద ఓ లుక్కేద్దామా?
దుపట్టాలను విడిగా సింగారించుకునే రోజులు పోయాయి. జారిపోకుండా సర్దుకునే శ్రమ లేకుండా, డ్రస్‌కు కలిపి కుట్టినట్టుండే అటాచ్డ్ దుపట్టాలు తాజా ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి. వాటి మీద ఓ లుక్కేద్దామా?
అన్ని సందర్భాల్లో...
అటాచ్డ్ దుపట్టాను కలిగి ఉన్న దుస్తులు మోడర్న్‌గా కనిపిస్తాయి కాబట్టి అవి కేవలం పార్టీ వేర్‌కే పరిమితం అనుకుంటే పొరపాటు. ఈ డ్రస్సులను పెళ్లి, పుట్టినరోజు వేడుకలు, ఈవినింగ్ పార్టీలకు కూడా ధరించవచ్చు. అయితే సాధారణ సందర్భాల్లో కాటన్‌తో తయారైన డ్రస్‌ను ఎంచుకోవాలి. ఇవి డైలీ వేర్‌కు కూడా బాగుంటాయి. వేడుకల కోసం ఫ్లాషీగా ఉండే డ్రస్‌ను ఎంచుకోవాలి.
అదనపు హంగుతో...
షరారాలు, గౌన్లు, చుడీదార్‌లు... వీటిలో దేనికైనా దుపట్టాను కలిపి కుడితే మరింత మోడర్న్‌గా కనిపించే డ్రస్ తయారవుతుంది. అటాచ్డ్ దుపట్టాలను కలిగి ఉండే డ్రస్సులన్నీ రెట్టింపు మోడర్న్ లుక్‌ను సంతరించుకోడానికి కారణం ఇదే! అయితే డ్రస్‌కు దానికి కలిపి కుట్టిన దుపట్టాకూ మధ్య కాంట్రాస్ట్ ఉండేలా చూసుకోవాలి. అదనపు హంగుల కోసం ఫ్రిల్స్, సెక్విన్ వర్క్ లాంటివి ఉండేలా చూసుకోవాలి.
యాక్సెసరీస్
హై హీల్స్, సింపుల్ జ్యువెలరీ, చిన్న హాండ్ బ్యాగ్ ఈ దుస్తులకు మ్యాచ్ అవుతాయి. షరారాకు న్యూడ్ హీల్స్ ధరించాలి. ఫ్రాక్స్‌కు పెన్సిల్ హీల్, లాంగ్ గౌన్‌కు బ్లంట్ హీల్స్ బాగుంటాయి. నడుముకు బెల్ట్ కూడా చక్కగా మ్యాచ్ అవుతుంది.