Share News

Beauty : స్కిన్‌ టోన్‌కు సూటయ్యేలా...

ABN , Publish Date - Sep 14 , 2024 | 12:39 AM

మేకప్‌ కోసం ఖరీదైన విదేశీ ఉత్పత్తులకు బదులుగా దేశీ ఉత్పత్తులను ఎంచుకుంటే, స్కిన్‌ టోన్‌కు మ్యాచ్‌ అయ్యేలా మేకప్‌ వేసుకోవడంతో పాటు, తక్కువ ఖర్చుతో మెరిసిపోవచ్చు. అదెలాగో చూద్దాం!

Beauty : స్కిన్‌ టోన్‌కు సూటయ్యేలా...

మేకప్‌

మేకప్‌ కోసం ఖరీదైన విదేశీ ఉత్పత్తులకు బదులుగా దేశీ ఉత్పత్తులను ఎంచుకుంటే, స్కిన్‌ టోన్‌కు మ్యాచ్‌ అయ్యేలా మేకప్‌ వేసుకోవడంతో పాటు, తక్కువ ఖర్చుతో మెరిసిపోవచ్చు. అదెలాగో చూద్దాం!

మన దేశ వాతావరణం, దానికి స్పందించే చర్మం తత్వం ఆధారంగా మేకప్‌ ఉత్పత్తులను ఎంచుకోవాలి. మన చర్మంలో మెలనిన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి పిగ్మెంటేషన్‌, కళ్ల కింద నల్లని వలయాలు, చర్మం జీవం కోల్పోవడం లాంటి లక్షణాలు సహజం. కాబట్టి వీటిని చర్మంలో కలిసిపోయేలా చేసే మేకప్‌ ప్రొడక్ట్స్‌ ఎంచుకోవాలి.

  • కన్‌సీల్‌, కరెక్ట్‌, రిపీట్‌

పిగ్మెంటేషన్‌, డల్‌నెస్‌ పోగొట్టడం కోసం కలర్‌ కరెక్టర్‌, కన్‌సీలర్‌ ఎంచుకోవాలి. క్రీమ్‌ రూపంలో ఉండే కలర్‌ కరెక్టర్‌ తేలికగా బ్లెండ్‌ అవుతుంది. లిక్విడ్‌ కరెక్టర్లు త్వరగా సెట్‌ అయిపోతాయి కాబట్టి వాటిని దూరం పెట్టడమే మేలు. పిగ్మెంటేషన్‌ కోసం ఆరెంజ్‌ కలర్‌ కరెక్టర్‌, ముదురు చర్మ రంగు ఉన్నవాళ్లు పీచ్‌ మొదలు మరింత శాచురేటెడ్‌ రంగులను ఎంచుకోవాలి.

  • బ్లష్‌ ఇలా...

చర్మ రంగుతో మ్యాచ్‌ అయ్యే బ్లష్‌లనే ఎంచుకోవాలి. తెలుపు, చామనచాయ రంగులో ఉండేవాళ్లు డస్టీ రోజ్‌ బ్లష్‌ ఎంచుకోవాలి. ముదురు చర్మపు రంగు కలిగిన వాళ్లు, డార్కిష్‌ కోరల్‌ బ్లష్‌ ఎంచుకోవాలి. క్రీమ్‌ బ్లష్‌లను నేరుగా వేలితో అప్లై చేసుకోవడమే ఉత్తమం. పౌడర్‌ బ్లష్‌లను బ్రష్‌తోనే అప్లై చేసుకోవాలి.

  • న్యూడ్స్‌ ఇలా...

న్యూడ్‌ లిప్‌ కలర్స్‌లో ఒకరికి నప్పినవి ఇంకొకరికి నప్పకపోవచ్చు. కాబట్టి చర్మపు రంగు ఆధారంగా లిప్‌ కలర్‌ ఎంచుకోవాలి. పెదవులు ఏ రంగులో ఉన్నాయో, ఆ రంగుకు దగ్గరగా ఉండే లిప్‌ కలర్‌ను ఎంచుకుంటే సహజసిద్ధంగా ఉంటుంది. భారతీయులు పిగ్మెంటెడ్‌ పెదవులు కలిగి ఉంటారు. కాబట్టి లిప్‌ పెన్సిల్‌తో పెదవులకు రంగును నింపేసి, పైన లిప్‌ కలర్‌ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన పెదవుల అసలు రంగు, లిప్‌ కలర్‌లో నుంచి బయటకు బహిర్గతం కాకుండా ఉంటుంది. అయితే న్యూడ్‌ లిప్‌స్టిక్‌ కలర్‌ కంటే కాస్త ముదురు రంగు లిప్‌ పెన్సిల్‌ వాడుకోవాలి. లేదంటే చర్మపు రంగుతో కలిసిపోయి, సాదాసీదాగా కనిపించే ప్రమాదం ఉంటుంది.

Updated Date - Sep 14 , 2024 | 12:39 AM