Share News

మలి వయసు మేకప్‌

ABN , Publish Date - May 05 , 2024 | 12:51 AM

‘‘ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ ఎ నంబర్‌’’ అంటారు. కానీ పైబడే వయసు చర్మం చెప్పేస్తూ ఉంటుంది. పైబడే వయసుతో చర్మం బిగుతు సడలి, జారిపోయి, ముడతలు పడి అందవిహీనంగా మారిపోతుంది.

మలి వయసు మేకప్‌

మేకప్‌

‘‘జ్‌ ఈజ్‌ జస్ట్‌ ఎ నంబర్‌’’ అంటారు. కానీ పైబడే వయసు చర్మం చెప్పేస్తూ ఉంటుంది. పైబడే వయసుతో చర్మం బిగుతు సడలి, జారిపోయి, ముడతలు పడి అందవిహీనంగా మారిపోతుంది. ఇలాంటి ఏజ్‌డ్‌ స్కిన్‌ను నవయవ్వనంగా మార్చే మేకప్‌ చిట్కాలు ఇవే!

హైడ్రేషన్‌ ముఖ్యం

మేకప్‌ ఉత్పత్తులను ముఖానికి అప్లై చేసే ముందు చర్మాన్ని హైడ్రేట్‌ చేయాలి. వయసు పైబడిన చర్మం జీవం కోల్పోయి, పొడిగా మారుతుంది. కాబట్టి మేకప్‌ ముడతలు పడిపోతుంది. ఇలా జరగకుండా ఉండడం కోసం, మేక్‌పకు ముందు మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. కొన్ని మాయిశ్చరైజర్లలో ఎస్‌పిఎఫ్‌ కూడా ఉంటుంది. ఇలాంటివి చర్మం మరింత డ్యామేజ్‌ అవకుండా కాపాడి, వయసు పైబడే లక్షణాలను నియంత్రిస్తాయి.

ఫౌండేషన్‌ ఇలా...

లైట్‌ వెయిట్‌ ఫౌండేషన్‌ ఎంచుకోవాలి. హెవీ లేదా మ్యాట్‌ ఫౌండేషన్లు ముఖ చర్మం మీద ఉండే సన్నని గీతల్లో, రంథ్రాల్లో ఇరుక్కుపోయి చర్మాన్ని మరింత అలసటగా కనిపించేలా చేస్తాయి. వాటికి బదులుగా షీర్‌ టు మీడియం కవరేజ్‌ ఉండే ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. దీంతో చర్మం సహజ మెరుపును సంతరించుకుంటుంది. ఫౌండేషన్‌లో ఫేసియల్‌ సీరం ఆయిల్‌ కలుపుకుంటే, ముఖానికి మెరుపు కూడా దక్కుతుంది. తడి స్పాంజ్‌ లేదా ఫ్లఫ్ఫీ బ్రష్‌తో ఫౌండేషన్‌ ముఖమంతా పరుచుకునేలా అద్దుకోవాలి. కళ్లు, ముక్కు, నోరు.. ఇలా ముడతలకు వీలున్న ప్రదేశాల్లో వీలైనంత తక్కువ ఫౌండేషన్‌ అప్లై చేసుకోవాలి.

కన్‌సీలర్‌ ఇలా...

కళ్ల కింద నల్లని వలయాలు, మచ్చలను దాచడానికి కన్‌సీలర్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని అవసరానికి మించి ఉపయోగిస్తే తగిన ఫలం దక్కకపోగా, అదనపు నష్టం జరుగుతుంది. ఎక్కువైతే కేకీ లుక్‌తో కనిపిస్తాం. కాబట్టి ఏ ప్రదేశాలను దాచాలనుకుంటున్నారో కనిపెట్టి, ఆచితూచి కన్‌సీలర్‌ అప్లై చేసుకోవాలి. కళ్ల కింద పీచీ ఎల్లో టోన్‌ కన్‌సీలర్‌ వాడుకోవాలి. మచ్చల కోసం స్కిన్‌ టోన్‌కు దగ్గరగా ఉండే కన్‌సీలర్‌ ఎంచుకోవాలి. చిన్న బ్రష్‌ లేదా వేలితో కన్‌సీలర్‌ను అద్దుకుని, స్పాంజ్‌తో బ్లెండ్‌ చేసుకోవాలి.

Updated Date - May 05 , 2024 | 04:54 AM