Skin Care : చర్మం మెరవాలంటే ఒకసారి నెయ్యిని ట్రై చేయండి..!
ABN , Publish Date - Jul 10 , 2024 | 03:56 PM
పెదవులకు కొద్దిగా నేతిని పూయడం వల్ల హైడ్రేషన్ గా ఉంటుంది. పెదవులు పొడిగా మారే సమస్య నుంచి లిప్ మాస్క్ గా ఉపయోగపడుతుంది.
నెయ్యి వంటకాలకు ప్రత్యేమైన రుచిని ఇస్తుంది. అలాగే నెయ్యితో అనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిలో నెయ్యితో చర్మ సౌందర్యాన్ని పెంచవచ్చు. పాల ఉత్పత్తులు చాలా వరకూ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవే. ఆరోగ్యకరమైన రంగు పెరగాలన్నా కూడా నెయ్యి పనిచేస్తుంది. నెయ్యి ఆరోగ్యకరమైన చర్మాన్ని, ప్రకాశవంతంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజింగ్ నుంచి యాంటీ ఏజింగ్‌గా ఎలా మారుస్తుందో తెలుసుకుందాం. అదెలాగంటే..
నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. చర్మ సంరక్షణలో నెయ్యని చేర్చడం వల్ల ప్రయోజనాలు.
కొద్దిగా నెయ్యిని తీసుకుని శరీరానికి పూయాలి. ఇలా చేయడం వల్ల నెయ్యలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తాయి.
సహజమైన ఎమోలియెంట్ లక్షణాలు పొడిగా ఉండటం, పొరలుగా ఉండే చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా చేస్తాయి.
Drinking Hot Water : వేడి నీటిని తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..
రెగ్యులర్‌గా వాడటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
పగిలిన పెదవులకు కూడా ఇది చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. పడుకునే ముందు పెదవులకు కొద్దిగా నేతిని పూయడం వల్ల హైడ్రేషన్ గా ఉంటుంది. పెదవులు పొడిగా మారే సమస్య నుంచి లిప్ మాస్క్ గా ఉపయోగపడుతుంది.
దీనితో లాభాలేమిటంటే.
నెయ్యి పగిలిన చర్నానికి ఉపశమనంగా పనిచేస్తుంది.
ఇందులో హైడ్రేటింగ్ లక్షణాలున్నాయి.
నెయ్యిలోని విటమిన్లు ఎ, ఇ ఉన్నాయి. ఇవి చర్మాన్ని నిగారింపుతో ఉంచేందుకు సహకరిస్తాయి.
ఈ విటమిన్లు పెదవుల పిగ్మెంటేషన్ ను తగ్గిస్తాయి.
Super Snacks : వర్షాకాలం ఈ స్నాక్స్ తింటే.. రుచే కాదు ఆరోగ్యం కూడా..!
శరీరానికి నెయ్యి పూయండి..
చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. మృదువుగా మారుస్తుంది.
నెయ్యిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చికాకుగా ఉన్న చర్మాన్ని ఉపశమనం చేస్తాయి.
తేమను గంటల తరబడి లాక్ చేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.