Cancer: క్యాన్సర్ కారకాలు ఇవే!
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:17 AM
క్యాన్సర్ గురించి మనకెన్నో అపోహలున్నాయి. ఏం తింటే క్యాన్సర్ వస్తుందో, ఏం తినకుండా ఉంటే క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చో నిరంతరం పరిశోధిస్తూనే ఉంటాం.
క్యాన్సర్ గురించి మనకెన్నో అపోహలున్నాయి. ఏం తింటే క్యాన్సర్ వస్తుందో, ఏం తినకుండా ఉంటే క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చో నిరంతరం పరిశోధిస్తూనే ఉంటాం. అయితే క్యాన్సర్ నుంచి ప్రాణాలతో బయటపడిన రోగులను అధ్యయనం చేసిన నికోల్ యాండ్రూస్ అనే ఒక ప్రముఖ డైటీషియన్ మద్యం, ప్రాసెస్ చేసిన మాంసాలే ప్రధాన క్యాన్సర్ కారకాలనే విషయాన్ని వెల్లడించింది. ఆంకాలజీలో స్పెషలైజేషన్ చేసిన ఈ డైటీషియన్, మాంసం పాడైపోకుండా ఉండడం కోసం, వాటి రంగు మారకుండా ఉండడం కోసం జోడించే నైట్రైట్స్, నైట్రేట్స్ వల్లే ప్రాసెస్ మాంసం క్యాన్సర్ కారకంగా మారుతోందని స్పష్టం చేస్తోంది. అలాగే అత్యధిక తాపమానాల్లో మాంసాన్ని వండడం వల్ల, డిఎన్‌ఎను పాడు చేసే హెటిరోసైక్లిక్ అమైన్స్ మాంసాల్లోకి చేరుకుంటాయనీ, వీటి మూలంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ఆమె పేర్కొంటోంది. అలాగే చక్కెరను ప్రధాన క్యాన్సర్ కారకంగా భావిస్తూ ఉంటాం. కానీ పరిమితంగా తిన్నంత కాలం చక్కెరతో క్యాన్సర్ ముప్పు ఉండదని కూడా ఆమె అంటోంది.