Share News

Beauty : చలికి చెదరని అందం

ABN , Publish Date - Oct 19 , 2024 | 05:12 AM

చలి కాలం చర్మం పొడిబారి, నిర్జీవంగా మారుతుంది. మరి ఇలాంటి వాతావరణంలో మేకప్‌ ఎలా చేసుకోవాలి? తెలుసుకుందాం!

Beauty : చలికి చెదరని అందం

మేకప్‌

చలి కాలం చర్మం పొడిబారి, నిర్జీవంగా మారుతుంది. మరి ఇలాంటి వాతావరణంలో మేకప్‌ ఎలా చేసుకోవాలి? తెలుసుకుందాం!

మాయిశ్చరైజింగ్‌ మాస్క్‌: చలి కాలంలో మాయిశ్చరైజర్‌ వాడకం పెంచాలి. చర్మం తేమగా మారడం కోసం మాయిశ్చరైజింగ్‌ మాస్క్‌లను మేక్‌పకు అరగంట ముందు అప్లై చేసుకుంటూ ఉండాలి. అలాగే ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత, మాయిశ్చరైజర్‌ అప్లై చేసి, అది చర్మంలో పూర్తిగా ఇంకిన తర్వాత మేకప్‌ మొదలుపెట్టాలి.

వాటర్‌ప్రూఫ్‌ మస్కారా: చలి కాలం చల్లని గాలులు సోకినప్పుడు కళ్లు తడిగా మారతాయి. దాంతో మస్కారా, కాటుకలు చెదిరిపోకుండా ఉండడం కోసం చలి కాలంలో తప్పనిసరిగా వాటర్‌ప్రూఫ్‌ మస్కారా, కాజల్‌ అప్లై చేసుకోవాలి.

ఫౌండేషన్‌: పౌడర్‌ ఫౌండేషన్లను చర్మం పీల్చుకోలేదు. కాబట్టి ఈ కాలంలో లిక్విడ్‌ ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. వాలైతే మాయిశ్చరైజర్‌, ఫౌండేషన్‌ రెండూ కలిపి వాడుకోవచ్చు.

షాడో: ఐ షాడో కోసం న్యూట్రల్‌ కలర్స్‌ ఎంచుకోవాలి. ఇందుకోసం కాపర్‌, బ్రాంజ్‌ కలర్స్‌ బాగుంటాయి.


బ్లష్‌: పింక్‌, పీచ్‌ కలర్‌ బ్లష్‌లు వింటర్‌కు సూటవుతాయి.

లిప్‌ బామ్‌: చల్లని గాలులకు పెదాలు పగిలిపోకుండా ఉండడం కోసం వెంట లిప్‌బామ్‌ ఉంచుకుని, తరచూ అప్లై చేసుకుంటూ ఉండాలి.

చర్మాన్ని ఇలా సిద్ధం చేయాలి : చలికాలం చర్మం పగలకుండా రాత్రి వేళ మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవడం తప్పనిసరి. అయితే ఆ జిడ్డును ముఖం నుంచి పూర్తిగా వదిలించిన తర్వాతే మేకప్‌ వేసుకోవాలి. మేక్‌పకు ముందు ముఖం తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. అలాగే తడి ఆరిన తర్వాత, తేమగా ఉన్నప్పుడే మేకప్‌ మొదలుపెట్టాలి. ఇలా ఆలస్యం చేయకుండా మేకప్‌ వేసుకోవడం వల్ల, చర్మానికి చక్కగా అంటుకుపోయి, ఎక్కువ సమయం చెక్కుచెదరకుండా ఉంటుంది. మేకప్‌ అప్లికేషన్‌ కోసం తడిపి, పిండిన స్పాంజిని వాడుకోవచ్చు. దీంతో ముఖం మీద ఫౌండేషన్‌ సమంగా పరుచుకుంటుంది. కళ్ల దిగువన అప్లై చేసేటప్పుడు వీలైనంత తక్కువ ఫౌండేషన్‌ వాడుకోవాలి.

Updated Date - Oct 19 , 2024 | 05:12 AM