Share News

Papaaya : బొప్పాయితో అందంగా...

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:03 AM

బొప్పాయి తింటే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఇదే బొప్పాయి గుజ్జు జుట్టుకే కాదు.. చర్మ సౌందర్యానికీ మేలు చేస్తుంది. బొప్పాయితో ఇలా సులువుగా ఫేస్‌ప్యాక్స్‌ చేసుకోవచ్చు...

Papaaya : బొప్పాయితో అందంగా...

బొప్పాయి తింటే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఇదే బొప్పాయి గుజ్జు జుట్టుకే కాదు.. చర్మ సౌందర్యానికీ మేలు చేస్తుంది. బొప్పాయితో ఇలా సులువుగా ఫేస్‌ప్యాక్స్‌ చేసుకోవచ్చు...

  • బౌల్‌లో పావు కప్పు బొప్పాయి గుజ్జును తీసుకుని ఇందులో రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, స్పూన్‌ తులసి పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మొటిమలు తగ్గిపోతాయి.

  • రెండు టేబుళ్ల బొప్పాయి చూర్ణంలోకి అరటీస్పూన్‌ పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పటిస్తే పిగ్నెంటేషన్‌ పోతుంది. ముఖం మీద ఉండే నొప్పులు పోతాయి. యూత్‌ఫుల్‌గా కనిపిస్తారు.

  • ఇంట్లో బొప్పాయి తప్ప ఏమీ లేకపోతే.. బొప్పాయి చూర్ణాన్ని చర్మంమీద పట్టించాలి. ముప్ఫయి నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల అందులోని ఎ, సి విటమిన్ల వల్ల చర్మంలో డీప్‌ క్లీనింగ్‌ జరుగుతుంది. చర్మం మిలమిలా మెరుస్తుంది.

  • బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల బొప్పాయి గుజ్జును, రెండు టేబుల్‌ స్పూన్ల అరటిగుజ్జు కలిపి ముఖానికి, మెడ చివర వరకూ పట్టించాలి. ఇలా తరచుగా చేస్తుంటే చర్మం మృదువుగా ఉంటుంది.

  • రెండు టేబుల్‌ స్పూన్ల బొప్పాయి పేస్టులో అరటీస్పూన్‌ కొబ్బరి నూనె వేసి మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే చర్మం మీద మంటలు తగ్గుతాయి.

  • బౌల్‌లో తెల్లసొన వేసి ఇందులోకి రెండు చెంచాల బొప్పాయి పేస్ట్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం మీద ముడతలు కనపడవు.

  • జిడ్డు చర్మం లేదా ఆయిలీ స్కిన్‌ ఉంటే నిద్రపోయే ముందు రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జు, రెండు స్పూన్ల పెరుగు తీసుకుని కలిపాక.. ముఖానికి పట్టించుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Updated Date - Jun 26 , 2024 | 05:03 AM