Share News

Ayurvedic medicine : పసుపుతో జాగ్రత్త

ABN , Publish Date - Nov 21 , 2024 | 06:14 AM

పసుపు మంచి ఆయుర్వేద ఔషధమని అందరికీ తెలిసిందే. దీనిని వంటల్లో కూడా విరివిగానే ఉపయోగిస్తుంటాం. కానీ పసుపుని మోతాదుకు మించి వాడితే ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం

Ayurvedic medicine : పసుపుతో జాగ్రత్త

పసుపు మంచి ఆయుర్వేద ఔషధమని అందరికీ తెలిసిందే. దీనిని వంటల్లో కూడా విరివిగానే ఉపయోగిస్తుంటాం. కానీ పసుపుని మోతాదుకు మించి వాడితే ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం

  • జీర్ణ సమస్యలు

    పసుపు కాలేయంలో పైత్యరసం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల పొట్టలో ఆమ్లతత్వం, జఠరాగ్ని పెరుగుతాయి. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు, కడుపు ఉబ్బరంగా అనిపించడం, తలనొప్పి, తల తిరగడం, అజీర్ణం, మలబద్దకం వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఛాతిలో మంట, పొట్టలో కురుపులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

  • మూత్రపిండాల్లో రాళ్లు

    పసుపులో ఆగ్జలేట్లు ఉంటాయి. పసుపును ఎక్కువగా వినియోగించినపుడు ఈ ఆగ్జలేట్లు శరీరంలోని కాల్షియంతో కలిసి కాల్షియం ఆగ్జలేట్‌ స్ఫటికాలుగా మారతాయి. పసుపులో ఉండే కొన్ని రకాల మినరల్స్‌ కూడా రాళ్లలా మారతాయి. ఇవన్నీ మూత్రపిండాల్లోకి చేరి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

  • రక్తం పలుచగా

    పసుపుకి యాంటీ కోయాగ్యులెంట్‌ గుణాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తాయి. దీనివల్ల రక్తం తొందరగా గడ్డకట్టదు. శరీరానికి ఏదైనా సర్జరీ జరిగినపుడు లేదా ప్రమాదవశాత్తూ గాయాలైనపుడు రక్తస్రావం ఆగక పలు సమస్యలు ఏర్పడతాయి.

  • ఐరన్‌ లోపం

    పసుపులో కర్కుమిన్‌ సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరానికి ఐరన్‌ ధాతువును అందకుండా చేస్తుంది. దీనివల్ల శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది.


  • రక్తపోటు

    పసుపుని మోతాదుకి మించి వాడినపుడు శరీరంలో రక్తపోటు స్థాయి ఉండాల్సిన దానికన్నా తగ్గిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల అధిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.

  • దద్దుర్లు

    పసుపుని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదతోపాటు ముఖంపై మొటిమలు కూడా ఏర్పడతాయి. డెర్మటైటిస్‌ సమస్యలు వచ్చే ప్రమాదముంది.

  • తలనొప్పి

    శరీరంలో కర్కుమిన్‌ స్థాయి ఎక్కువైనపుడు తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది. ఎప్పుడూ మైకం కమ్మినట్లు ఉంటుంది. అందుకే రోజుకి 500 నుంచి 2,000 మిల్లీగ్రాముల మోతాదుకి మించి పసుపు తీసుకోకూడదు.

Updated Date - Nov 21 , 2024 | 06:14 AM