భలే ‘బటన్ డౌన్’
ABN , Publish Date - Nov 13 , 2024 | 06:25 AM
జాలీగా, కులాసాగా షికారు చేసే సమయంలో సౌకర్యంగా ఉండే దుస్తుల మీదే దృష్టి పెడతాం! అలాంటి వాటిలో చెప్పుకోదగినవి ‘బటన్ డౌన్’ డ్రస్సులు. సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉండే ఈ రకం దుస్తుల్లో ఇదిగో ఇలా అదరగొట్టేయాలి.
జాలీగా, కులాసాగా షికారు చేసే సమయంలో సౌకర్యంగా ఉండే దుస్తుల మీదే దృష్టి పెడతాం! అలాంటి వాటిలో చెప్పుకోదగినవి ‘బటన్ డౌన్’ డ్రస్సులు. సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉండే ఈ రకం దుస్తుల్లో ఇదిగో ఇలా అదరగొట్టేయాలి.
స్లీవ్స్ పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, స్లీవ్స్ లేకపోయినా, ఎలాంటి స్లీవ్స్ అయినా బటన్ డౌన్ షర్టుకు నప్పుతాయి. స్లీవ్స్‌ను మడవడం మరొక తాజా ఫ్యాషన్.
బటన్ డౌన్ డ్రస్సుల మూలాలు పురుషుల షర్టుల్లో ఉన్నాయి. ఆ చొక్కాల నుంచే షర్ట్ డ్రస్సులు పుట్టుకొచ్చాయి. వాటికి కొత్త హంగులు జోడించి, పైనుంచి కింది వరకూ వరుస గుండీలుండే షర్ట్ డౌన్ డ్రస్సులు రూపొందాయి. కాలర్, ముందు వైపు గుండీలు కలిగి ఉండడం ఈ దుస్తుల ప్రత్యేకత. కాటన్ సిల్క్ లాంటి బిరుసుగా ఉండే ఫ్యాబ్రిక్‌తో ఈ దుస్తులు తయారవుతూ ఉంటాయి. తాజాగా కాటన్, క్రేప్ మొదలైన మెటీరియల్స్‌ను కూడా ఈ దుస్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు.
సన్నగా, నాజూకుగా కనిపించేలా చేసే షర్ట్ డౌన్ డ్రస్సులు డైలీవేర్‌గా కూడా పనికొస్తాయి. వీటిని ధరించడం, నిర్వహించడం తేలిక కాబట్టి డైలీవేర్‌గా, ఈవినింగ్ వేర్‌గా రెండు విధాలా ఉపయోగించుకోవచ్చు.
పూల డిజైన్లు, జామెట్రిక్ డిజైన్లు, నిలువు చారలు... ఇలా ఎన్నో రకాల డిజైన్లలో ఈ డ్రస్సులు దొరుకుతూ ఉంటాయి. అలాగే ఎన్నో రకాల ఆకట్టుకునే ప్రింటుల్లో కూడా ఈ దుస్తులు రూపొందుతూ ఉంటాయి. కాబట్టి నచ్చిన డిజైన్‌ను ఎంచుకునే
వీలుంటుంది.
వెడ్జెస్, స్టేట్‌మెంట్ జ్యువెలరీలను జోడించిన బటన్ డౌన్ డ్రస్సులు చిన్న చిన్న పార్టీలకు బాగుంటాయి. ఫ్లాట్స్, హ్యాట్‌లను జోడించిన బటన్ డౌన్ డ్రస్సు క్యాజువల్ వేర్‌గా సూటవుతుంది.