Share News

Ghost Poop : కాలకృత్యాల్లో ఇలా...

ABN , Publish Date - Oct 22 , 2024 | 05:47 AM

టాయిలెట్‌కు వెళ్లినప్పుడు సుఖ విరోచనం మీదే దృష్టి పెడతాం! కానీ మన జీర్ణవ్యవస్థ పనితీరు ఎంత భేషుగ్గా ఉందో తెలుసుకోవాలంటే, కమోడ్‌ మీద కూడా దృష్టి పెట్టాలి.

Ghost Poop : కాలకృత్యాల్లో ఇలా...

ఘోస్ట్‌ పూప్‌

టాయిలెట్‌కు వెళ్లినప్పుడు సుఖ విరోచనం మీదే దృష్టి పెడతాం! కానీ మన జీర్ణవ్యవస్థ పనితీరు ఎంత భేషుగ్గా ఉందో తెలుసుకోవాలంటే, కమోడ్‌ మీద కూడా దృష్టి పెట్టాలి.

టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత ఫ్లష్‌ ఆన్‌ చేస్తాం. ఆ నీళ్లతో టాయిలెట్‌ పూర్తిగా శుభ్రపడాలి. అంటే, అశుద్ధం ఆనవాళ్లేవీ దాన్లో కనిపించకూడదు. అలా కాకుండా అశుద్ధం టాయిలెట్‌ గోడలకు అంటుకుని ఉండిపోతున్నా, నీళ్లతో వదిలించడం కష్టంగా ఉన్నా, మన జీర్ణ వ్యవస్థ అవసరమైనంత సమర్థంగా పని చేయడం లేదని అర్థం చేసుకోవాలి అంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజి్‌స్టలు. ఇలా వదలని అశుద్ధాన్ని సులువుగా సంబోధించడం కోసం, వైద్యులు, ఘోస్ట్‌ పూప్‌ లేదా, ఫాంటమ్‌ పూప్‌ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం తినే ఆహారంలోని ప్రతిదీ పూర్తిగా జీర్ణమౌతుంది. దాంతో అశుద్ధంలో ఎలాంటి వాయువులూ, కొవ్వులూ చేరుకోవు. దాంతో టాయిలెట్‌కు వెళ్లినప్పుడు, అశుద్ధం ఎటువంటి ఆనవాళ్లూ లేకుండా తేలికగా నీళ్లతో కొట్టుకుపోతుంది. పరిపూర్ణమైన జీర్ణవ్యవస్థకు ఇదే సూచన. ఇందుకు విరుద్ధమైన లక్షణాలు టాయిలెట్‌లో కనిపిస్తే, మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని అనుమానించాలి. సమస్యను సరిదిద్దుకోవడం కోసం వైద్యుల సూచన మేరకు ఆహారపుటలవాట్లను సరిదిద్దుకుని, జీర్ణ వ్యవస్థను మెరుగు పరుచుకోవాలి.

Updated Date - Oct 22 , 2024 | 05:47 AM