స్లాక్ నుంచి జీఐఎఫ్ ఫైండర్
ABN , Publish Date - Mar 15 , 2024 | 11:14 PM
వ్యాపారాలు, టీమ్స్ కోసం ఉద్దేశించి కమ్యూనికేషన్ టూల్స్‌గా స్లాక్ ప్రసిద్ధి. టీమ్ పరిధిలో ఈమెయిల్, ఫోన్ కాల్స్‌కు స్వస్తిపలికేలా చేసింది. ఇప్పుడు ఇదే కమ్యూనికేషన్ టూల్ తాజాగా జీఐఎఫ్ ఫీచర్‌ను కలిపింది. టీమ్ సభ్యుల మధ్య ఫన్ కోసం దీన్ని క్రియేట్ చేసింది.
వ్యాపారాలు, టీమ్స్ కోసం ఉద్దేశించి కమ్యూనికేషన్ టూల్స్‌గా స్లాక్ ప్రసిద్ధి. టీమ్ పరిధిలో ఈమెయిల్, ఫోన్ కాల్స్‌కు స్వస్తిపలికేలా చేసింది. ఇప్పుడు ఇదే కమ్యూనికేషన్ టూల్ తాజాగా జీఐఎఫ్ ఫీచర్‌ను కలిపింది. టీమ్ సభ్యుల మధ్య ఫన్ కోసం దీన్ని క్రియేట్ చేసింది. రోజువారీ మెసేజింగ్‌లో జీఐఎఫ్‌కు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. జీఐఎఫ్‌ని ఇంటిగ్రేట్ చేసినట్టు స్లాక్ ప్రత్యేకించి ఎక్స్‌లో పోస్టు చేసింది. దీంతో పర్ఫెక్ట్ జీఐఎఫ్‌ను యూజర్లు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. కొత్త ఫీచర్ కాస్తా ఇప్పుడు గూగుల్‌కు చెందిన జీఐఎఫ్ సెర్చ్ ఇంజిన్‌గా మారింది. ఈ ఫీచర్ సహాయంతో వేలాది జీఐఎఫ్‌లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. స్లాక్‌పై జీఐఎఫ్‌ల కోసం అవసరమైన చాట్‌ను ఓపెన్ చేయాలి. తదుపరి ఎమోజీ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ జీఐఎఫ్ ట్యాబ్ కనిపిస్తుంది. పాపప్ అయిన వాటి నుంచి ఎంచుకుని జతచేసుకోవాలి. అపై షేర్ చేసుకోవాలి.