NAVYA : ‘గూగుల్ పే’ ని మించిన వాలెట్
ABN , Publish Date - May 11 , 2024 | 12:50 AM
ఇండియాలోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది. భారతీయ యూజర్ల రోజువారి వ్యవహారాలను ఈ వాలెట్‌తో ఇకపై చక్కబెట్టుకోవచ్చు. గూగుల్ పేకి మించిన సౌకర్యాలు ఇందులో ఉంటాయి.
ఇండియాలోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది. భారతీయ యూజర్ల రోజువారి వ్యవహారాలను ఈ వాలెట్‌తో ఇకపై చక్కబెట్టుకోవచ్చు. గూగుల్ పేకి మించిన సౌకర్యాలు ఇందులో ఉంటాయి. పలు డిజిటల్ డాక్యుమెంట్స్ అంటే బోర్డింగ్ పాస్‌లు, లాయల్టీ కార్డులు, మూవీ టికెట్స్ సహా పలు పనులకు ఇది తోడ్పడుతుంది.
దీని ప్రభావం గూగుల్ పే పై ఉండదు కూడా. ఇదో భద్రతతో కూడిన వాలెట్. ఇరవైకి పైగా బ్రాండ్స్‌తో ఈ వాలెట్‌కు భాగస్వామ్యం ఉంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఫ్లిప్‌కార్ట్, పైన్ ల్యాబ్స్ వాటిలో కొన్ని మాత్రమే. రాబోయే నెలల్లో మరికొన్నింటితో భాగస్వామ్యం పొందనుంది.
యాపిల్ వాలెట్ మాదిరిగానే ఉంటుంది. దీన్ని నాన్ పేమెంట్ యూజర్ల కోసం ఉద్దేశించారు. చాలా దేశాలు గూగుల్ పే, గూగుల్ వాలెట్ రెంటినీ కలిపేస్తున్నాయి. ఇండియాలో మాత్రం రెంటినీ వేర్వేరు అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు.
తేడాలు ఇవే గూగుల్ పే
గూగుల్ పే కేవలం నగదు లావాదేవీలకు పరిమితం. కేవలం డిజిటల్ పేమెంట్స్‌కు ఉపయోగపడుతుంది.
గూగుల్ పే ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. తద్వారా క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని దాచిపెడుతుంది.
గూగుల్ వాలెట్
యూపీఐ పేమెంట్స్ లేదా నగదు బదిలీ గూగుల్ వాలెట్‌తో కుదరదు. బోర్డింగ్ పాస్‌లు, మూవీ టికెట్లసహా పలు డాక్యుమెంట్లను వాలెట్ భద్రపరుస్తుంది.
గూగుల్ వాలెట్ క్రెడెన్షియల్స్, పాస్‌లు, క్యూఆర్ కోడ్స్‌తో టాగ్ అయిన పాస్‌లను భద్రంగా దాచి పెడుతుంది.