ఇంట్లోనే మొక్కలు పెంచేద్దాం
ABN , Publish Date - Nov 07 , 2024 | 05:53 AM
ఇంటి చుట్టూ అందమైన మొక్కలు పెంచితే చూడడానికి బాగుంటుంది. పెద్దగా ఖాళీ స్థలం లేకపోయినా చిన్న కుండీలు ఏర్పాటు చేసుకుని వాటిలో రకరకాల మొక్కలు పెంచుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడకుండా కుండీల్లో త్వరగా పెరిగే మొక్కల గురించి తెలుసుకుందాం!

రంగు రంగుల పూలను చూస్తే మనసు అహ్లాదకరంగా ఉంటుంది. గులాబీ, మల్లె, కనకాంబరాలు, బంతి, చేమంతి వంటి పూల మొక్కలతోపాటు టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకులను కూడా కుండీల్లో పెంచవచ్చు. వీటిని పెంచే కుండీల్లో ఎర్రటి మట్టి నింపాలి. తగినంత నీటిని అందిస్తూ వాడేసిన టీ పొడి. గుడ్డు పెంకులు, ఉల్లి పొట్టు కూడా వేస్తుంటే అవి ఎరువులా పనిచేసి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
కాకార కాయ, బెండకాయ, వంకాయ, బీన్స్ విత్తనాలు బజారులో దొరుకుతాయి. వీటిని తెచ్చి కుండీల్లో చల్లి కొద్దిగా నీళ్లు చల్లుతూ ఎండ తగిలేలా ఉంచితే మొక్కలు బాగా పెరుగుతాయి.
మనం రోజూ వాడుకునే కూరగాయల తొక్కలను, ఎండిన పూలను కుండీల్లో వేస్తే మట్టిలో ఎక్కువ సేపు తేమ నిలిచి ఉంటుంది. వాటి ద్వారా మొక్కకు పోషకాలు కూడా అందుతాయి.
మందారం చెట్టు కొమ్మను తీసుకొచ్చి కొద్దిగా కట్‌చేసి కుండీలో నాటాలి. కొద్దిగా నీరు పిచికారీ చేసి ఎండ తగిలేలా ఉంచితే కొమ్మ నాటుకుంటుంది. నెల రోజుల్లో మొక్క పెరుగుతుంది. దీనికి తెల్ల పురుగు చేరకుండా పసుపు నీళ్లు లేదంటే వేపనూనె కలిపిన నీళ్లు మొక్కమీద చల్లుతూ ఉండాలి.