Share News

ఎముకల్లో గట్టిదనం...

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:11 AM

ఇంటికి పిల్లర్లు ఉన్నట్లు.. మన శరీరానికి ఎముకలు ఉన్నాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి కాల్షియం ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాల ఉత్పత్తుల్లో ఇది పుష్కలం.

ఎముకల్లో గట్టిదనం...

ఇంటికి పిల్లర్లు ఉన్నట్లు.. మన శరీరానికి ఎముకలు ఉన్నాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి కాల్షియం ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాల ఉత్పత్తుల్లో ఇది పుష్కలం. అయితే పాల ఉత్పత్తులను తీసుకోనివారు ఎలాంటి ఫుడ్‌ను తీసుకోవాలో తెల్సుకుందాం.

  • చేపల్లో కాల్షియం, విటమిన్‌-డి, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. దీనివల్ల ఎముకలు గట్టితనానికి ఎంతో మంచి ఆహారమిది.

  • స్వీట్‌ పొటాటోల్లో మాంగనీస్‌తో పాటు కాల్షియం ఉంటుంది. పాలకూర, బ్రొకోలీ, తోటకూరతో పాటు తాజా కూరగాయలూ తినాలి. పల్లీలు, జీడిపప్పు, బాదం లాంటి నట్స్‌లో కాల్షియం పుష్కలం. దీనివల్ల ఎముకలు గట్టిగా ఉంటాయి.

  • నిమ్మ, నారింజ, బొప్పాయి, స్ర్టాబెర్రీ, మామిడిపండ్లు లాంటివి కొల్లాజిన్‌ అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

  • బీన్స్‌ గింజలు ఎముకలకు మేలు చేస్తాయి. ముఖ్యంగా తెల్లని బీన్స్‌లో కాల్షియం, పొటాషియం, మాంగనీసు పుష్కలం.

Updated Date - Apr 21 , 2024 | 04:11 AM