Share News

Health : రక్త శుద్ధి సులువే!

ABN , Publish Date - Sep 10 , 2024 | 02:10 AM

రక్తంలో ఇన్‌ఫెక్షన్లు ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయి. రోగ కారకాలు రక్తంలోకి చొరబడినా, ఎప్పటికప్పుడు నశించి ఆరోగ్యం క్షేమంగా ఉండాలంటే అందుకు తోడ్పడే పదార్థాలతో రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకోసం...

Health : రక్త శుద్ధి సులువే!

మీకు తెలుసా?

రక్తంలో ఇన్‌ఫెక్షన్లు ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయి. రోగ కారకాలు రక్తంలోకి చొరబడినా, ఎప్పటికప్పుడు నశించి ఆరోగ్యం క్షేమంగా ఉండాలంటే అందుకు తోడ్పడే పదార్థాలతో రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకోసం...

  • బీట్‌రూట్‌: యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్స్‌ కలిగి ఉండే బీట్‌రూట్‌ రక్తాన్ని డిటాక్సిఫై చేసి, నైట్రిక్‌ యాసిడ్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో రక్తనాళాలు విప్పారి, రక్తప్రసరణ మెరుగవుతుంది.

  • వెల్లుల్లి: సల్ఫర్‌ కాంపౌండ్స్‌ను కలిగి ఉండే వెల్లుల్లి సహజసిద్ధ రక్తశుద్ధి గుణాలను కలిగి ఉంటుంది. అదనపు కొవ్వులను రక్తం నుంచి తొలగించి, విసర్జించేలా చేయడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులను తగ్గిస్తుంది.

  • నిమ్మ: విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉండే నిమ్మ సహజసిద్ధ రక్తశుద్ధికి సహాయపడుతుంది. రక్తంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయ డిటాక్సిఫికేషన్‌కు తోడ్పడుతుంది. కాబట్టి తరచూ నిమ్మరసాన్ని ఆహార పదార్థాలకు జోడిస్తూ ఉండాలి.

  • పసుపు: పసుపులోని కుర్‌క్యుమిన్‌ శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. ఈ యాంటీఆక్సిడెంట్‌ రక్తాన్ని డిటాక్సిఫై చేసి, కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది.

  • దానిమ్మ: రక్తాన్ని శుద్ధి చేసే ఏకైక పండు ఇది. దీన్లోని యాంటీఆక్సిడెంట్స్‌ అయిన ప్యూనికలాజిన్స్‌, విటమిన్‌ సిలు శరీరాన్ని ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి తప్పిస్తాయి. రక్తశుద్ధికి దోహదపడతాయి. రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.

  • ఆకుకూరలు: బచ్చలి కూర, కేల్‌, ఇతరత్రా ఆకుకూరలన్నింట్లో పత్రహరితం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని విషాలను బయటకు వెళ్లగొట్టి ఆక్సిజన్‌ మోతాదులను పెంచుతుంది. ఫలితంగా రక్తం శుద్ధి అవుతుంది.

Updated Date - Sep 10 , 2024 | 02:10 AM