Share News

Awareness : నిద్రకు ముందు చక్కెర వద్దు

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:57 AM

భోజనం తర్వాత తీపి తినే అలవాటుంటే, రాత్రి భోజనం సమయంలో ఆ అలవాటుకు స్వస్థి పలకాలి.

Awareness : నిద్రకు ముందు చక్కెర వద్దు

భోజనం తర్వాత తీపి తినే అలవాటుంటే, రాత్రి భోజనం సమయంలో ఆ అలవాటుకు స్వస్థి పలకాలి. రాత్రి తినే తీపితో కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలుంటాయి. అవేంటో తెలుసుకుందాం!

తీపి రక్తంలోని చక్కెర మోతాదులను పెంచుతుంది. దాంతో రాత్రి వేళ తరచూ నిద్రాభంగం కలుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే రాత్రి తీపి తినడం మానేయాలి

రాత్రి వేళ తీపి మానేస్తే, మరుసటి ఉదయం శరీరం మరింత చురుకుదనం పొందుతుంది

రాత్రి వేళ తీపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద అదనపు భారం పడుతుంది. కణ మరమ్మతుతో పాటు, విషాలను శరీరం నుంచి వెళ్లగొట్టే అవకాశాన్ని శరీరానికి కల్పించాలంటే నిద్రకు ముందు తీపి తినడం మానుకోవాలి

అదనపు క్యాలరీలు తగ్గి బరువు పెరిగే ముప్పు తప్పుతుంది

చక్కెర హార్మోన్ల మీద ఎక్కువ. తీపి మానేస్తే, హార్మోన్ల అసమతౌల్యం సమస్య తొలగిపోతుంది.

Updated Date - Nov 26 , 2024 | 03:58 AM